Breaking News

పంటల బీమా వచ్చేనా?

Published on Wed, 07/16/2025 - 04:32

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటినా... పంటల బీమా పథకం అమలుపై ఇప్పటివరకు మార్గదర్శకాలు రూపొందించలేదు. బీఆర్‌ఎస్‌ హయాంలో రద్దయిన పంటల బీమా పథకాన్ని 2024 వానకాలం సీజన్‌లోనే పునః ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించినా.. గత రెండు సీజన్లలో పంటల బీమాపై అడుగు ముందుకు పడలేదు. 

రాష్ట్రంలో వానకాలం సీజన్‌ ప్రారంభమై ఇప్పటికే 60 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు వేశారు. ఈసారైనా పంటల బీమా పథకాన్ని అమలు చేస్తారా లేదా? అని రైతులు ఎదురు చూస్తున్నారు. పంటల బీమాకు సంబంధించి ప్రధాన మంత్రి ఫసల్‌ బీమా పథకంలో చేరాలా లేక సొంతంగా రాష్ట్రంలో బీమా పథకాన్ని రూపొందించాలా? అనేది ప్రభుత్వం తేల్చుకోలేకపోతోంది.  

మూడు నెలలైనా ముందుకు పడని అడుగు 
పంటల బీమా పథకానికి విధి విధానాలు రూపొందించాలని ఏప్రిల్‌ 23వ తేదీన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. కానీ, ఇప్పటివరకు వ్యవసాయ శాఖ దానిని పట్టించుకోనే లేదు. గతంలో వ్యవసాయ శాఖ అధికారులు, బ్యాంకర్లతో మంత్రి సమావేశమైనప్పటికీ బ్యాంకర్లు పంటల బీమాపై ఆసక్తి చూపలేదు. దీంతో ప్రధాని ఫసల్‌ బీమా పథకంలోనే చేరాలని సూత్రప్రాయంగా నిర్ణయించినప్పటికీ, ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. రాష్ట్రంలో ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన పథకాన్ని గతంలో అమలు చేశారు. 2018–19 సీజన్‌ తరువాత ఈ పథకాన్ని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిలిపివేసింది.  

11 క్లస్టర్లుగా రాష్ట్రం 
రాష్ట్రంలో పంటల బీమాను పునరుద్ధరించాలంటే ఫసల్‌ బీమా ఒక్కటే సరైనదిగా రాష్ట్ర ప్రభుత్వం ఒక అంచనాకు వచి్చంది. రాష్ట్రాన్ని 11 క్లస్టర్లుగా విభజించి బీమా అమలు చేయాలని నిర్ణయించారు. వానకాలం సీజన్‌లో సుమారు 132 లక్షల ఎకరాల్లో పంటలు, యాసంగిలో 78 లక్షల ఎకరాల్లో వేస్తారని లెక్క కట్టారు. ఈ నేపథ్యంలో ఫసల్‌ బీమా పథకం మార్గదర్శకాల ప్రకారంగా వానకాలానికి మొత్తం ప్రీమియంలో రైతు వాటా కింద 2 శాతం, యాసంగిలో 1.5 శాతం.. వాణిజ్య, ఉద్యాన పంటలకు 5 శాతం ప్రీమియం రైతు వాటాగా తీసుకోవాలని నిర్ణయించారు. 

మిగిలిన ప్రీమియంలో రాష్ట్రం, కేంద్రం 50:50 చొప్పన భరిస్తాయి. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులతో ఈసారి వరి సాగు మందగించింది. కాగా, పంటలు వేసిన తరువాత క్షేత్రస్థాయిలో వ్యవసాయ విస్తరణాధికారులు క్రాప్‌ బుకింగ్‌ ప్రక్రియ చేపడతారు. అంటే ఏ పంటను ఏ రైతు ఎంత విస్తీర్ణంలో సాగు చేశారనే లెక్కలను రూపొందిస్తారు. ఈ ప్రక్రియ పూర్తయిన తరువాతే పంటల బీమా పథకం అమలు ప్రక్రియ ప్రారంభమవుతుందని వ్యవసాయశాఖలోని ఒక కీలక అధికారి తెలిపారు.   

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు