Breaking News

‘విజయ’ పాలకు ఎసరు, అధికారుల తీరుపై విమర్శలు.. కావాలనే చేస్తున్నారా?

Published on Thu, 04/13/2023 - 04:02

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ ఆధ్వర్యంలోని విజయ డెయిరీ పాల విక్రయాలపై కుట్ర జరుగుతోందా..?. అంగన్‌వాడీ కేంద్రాలకు విజయ పాలు సరఫరా కాకుండా అధికారులే అడ్డుపడుతున్నారా.. ? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అనాల్సి వస్తోంది. విజయ డెయిరీకి టెండర్‌ దక్కకుండా అధికారులే నిబంధనలు రూపొందించారన్న ఆరోపణలు వస్తున్నాయి.

అంగన్‌ వాడీ కేంద్రాలకు పాల సరఫరా కోసం ఇటీవల ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో టెండర్లు ఆహా్వనించారు. కేవలం కర్ణాటక, గుజరాత్‌లకు చెందిన డెయిరీలకే టెండర్‌ దక్కేలా నిబంధనలు రూపొందించారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవానికి నోడల్‌ ఏజెన్సీగా ఉన్న హాకా ఆయా టెండర్లు పిలవాల్సి ఉండగా, దాన్ని పక్కనపెట్టి ఐసీడీఎస్‌ ద్వారా టెండర్లు పిలవడంపై కూడా వివాదం రేగుతోంది. 

ఏడాదికి 3 కోట్ల లీటర్ల విజయ పాలకు ఎసరు
రాష్ట్రవ్యాప్తంగా 35,700 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. వాటిల్లో 4.57 లక్షల మంది గర్భిణీలు, బాలింతలు ఉన్నారు. 10.34 లక్షల మంది ఏడాది నుంచి నుంచి 3 ఏళ్లలోపు పిల్లలు, 6.67 లక్షలు 3 ఏళ్ల నుంచి ఆరేళ్లలోపు పిల్లలు లబ్ది పొందుతున్నారు. వీరికి ప్రభుత్వం తరపున పాలు అందజేస్తారు. ఒక్కో తల్లికి 200 మిల్లీలీటర్ల పాలు అందజేస్తారు. అందుకోసం ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాలకు పాలు సరఫరా చేస్తుంది.

ఏడాదికి అంగన్‌వాడీ కేంద్రాలకు దాదాపు 3 కోట్ల లీటర్ల టెట్రాప్యాక్‌ పాలు సరఫరా చేస్తున్నారు. ఈ పాలను రాష్ట్రంలోని విజయ డెయిరీ వంటి సహకార డెయిరీల నుంచి సరఫరా చేయాలని నిర్ణయించారు. వాటికే ప్రాధాన్యం ఇవ్వాలని గతంలో ప్రభుత్వ జీవోలో స్పష్టం చేశారు. అయితే ఇప్పుడు నిబంధనలు మార్చడంతో విజయ డెయిరీకి భారీగా నష్టం వాటిల్లనుంది. దాదాపు రూ.120 కోట్ల విలువైన వ్యాపారానికి గండిపడుతుందనే చెప్పాలి.  

సామర్ధ్యానికి మించి నిబంధనలు... 
20 రోజుల క్రితం హాకా ఆధ్వర్యంలో టెండర్లు పిలిచారు. అప్పుడు సింగిల్‌ టెండరే వచ్చింది. దీంతో మళ్లీ టెండర్లు వేయాలనుకున్నారు. కానీ ఈసారి హాకాను పక్కనపెట్టి ఐసీడీఎస్‌ వర్గాలు టెండర్లకు వెళ్లాయి. విజయ డెయిరీ టెట్రాప్యాక్‌ పాల సామర్థ్యం రోజుకు 50 వేల లీటర్లు కాగా, టెండర్‌లో 3 లక్షల లీటర్ల సామర్థ్యం ఉండాలని పొందుపరిచారు.

అలాగే గత మూడేళ్లలో ఏదో ఒక ఏడాది 1.5 కోట్ల లీటర్ల టెట్రాప్యాక్‌లు సరఫరా చేసిన సామర్థ్యం ఉండాలన్న నిబంధనను కూడా విధించారు. ఈ సామర్థ్యం కూడా విజయ డెయిరీకి లేదు. గతంలో ఇలాంటి నిబంధనలను  విధించలేదు.  కేవలం కర్ణాటక, గుజరాత్‌కు చెందిన డెయిరీలకే అనుకూలంగా నిబంధనలు ఉన్నాయని  చెబుుతు న్నారు. ఈ నెల 20వ తేదీన టెండర్‌ దా ఖలుకు చివరి తేదీ కాగా, నిబంధనలు ఎలా ఉన్నా టెండర్లు వేస్తామని విజయ డెయిరీ వర్గాలు వెల్లడించాయి.

Videos

గుత్తిలో కౌన్సిలర్ల నామినేషన్లకు అడ్డంకులు.. శివంగిలా ఎదురెళ్లి ఇచ్చిపడేసిన నైరుతి రెడ్డి

150 కుటుంబాలు TDPకి బై బై.. విజయనగరంలో బాబుకు బిగ్ షాక్

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

మీ కంటే YSRCP నయం.. 40 సంవత్సరాలు TDPకి పని చేసినందుకు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా..!

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)