Breaking News

‘వెంటపడి వేధించిండు.. అందుకే చంపేసిన’

Published on Thu, 03/30/2023 - 08:29

సాక్షి, ములుగు: జిల్లాలోని ఏటూరునాగారం పరిధిలో యువకుడి దారుణ హత్య కలకలం రేపింది. తనను వేధిస్తున్న దగ్గరి బంధువును.. కత్తితో పొడిచి చంపింది ఓ యువతి. హత్య అనంతరం సరాసరి పోలీస్‌ స్టేషన్‌కి వెళ్లి తాను ఎందుకు చంపింది వివరించి మరీ పోలీసులకు లొంగిపోయిందామె. 

ఏర్రలవాడలో నివసించే రామటెంకి శ్రీనివాస్‌ అనే యువకుడు స్థానికంగా ఉంటున్న జాడి సంగీతను ప్రేమ, పెళ్లి పేరుతో వేధిస్తున్నాడు. వీళ్లిద్దరూ దగ్గరి బంధువులు. ఇరు కుటుంబాలు కూలీ పనితో జీవనం కొనసాగిస్తున్నాయి. అయితే.. సంగీతపై శీను వేధింపులు శ్రుతి మించిపోతూ వస్తున్నాయి.  ఈ క్రమంలో విసిగిపోయిన ఆమె.. శీనుపై కేసు పెట్టింది.  దీంతో శీనును అరెస్ట్‌ చేశారు పోలీసులు. జైలుకు వెళ్లొచ్చాక కూడా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు.  వెంటపడి పెళ్లి చేసుకోవాలంటూ వేధించడం పెంచాడు. 

ఈసారి మద్యం మత్తులో వేధించడం మొదలుపెట్టాడు. భరించలేకపోయిన సంగీత.. శీనును చేతులు కట్టేసి మరీ కత్తితో పొడిచి చంపేసింది. ఆపై నేరుగా స్థానిక పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)