Breaking News

జిమ్‌లలో కొత్త దందా..‘ఇంజెక్షన్లు’తో బాడీ బిల్డింగ్‌.. డీసీఏ దాడులతో గుట్టురట్టు

Published on Sat, 10/18/2025 - 10:55

హైదరాబాద్‌: నగరంలోని పలు జిమ్‌లలో బాడీ బిల్డింగ్‌ కోసం అక్రమంగా మెఫెంటెర్మైన్ సల్ఫేట్ ఇంజెక్షన్లు వినియోగిస్తున్న ఉదంతం వెలుగు చూసింది. తాజాగా తెలంగాణలోని డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ)సికింద్రాబాద్‌లోని నామాలగుండుకు చెందిన ఎం. నరేష్ అనే వ్యక్తి అక్రమంగా నిల్వ చేసిన కార్డియాక్ స్టిమ్యులెంట్ మందులను స్వాధీనం చేసుకుంది. ఈ కేటగిరిలోని టెర్మిన్ ఇంజెక్షన్లు, టెర్మివా ఇంజెక్షన్లు (మెఫెంటెర్మైన్ సల్ఫేట్ ఇంజెక్షన్లు)ను స్వాధీనపరుచుకుంది. జిమ్‌లలో బాడీబిల్డింగ్‌ కోసం వచ్చేవారికి ఈ మందులను చట్టవిరుద్ధంగా విక్రయిస్తున్నారని వెల్లడయ్యింది.

ఖార్కానా పోలీసుల నుండి అందిన సమాచారం ఆధారంగా సికింద్రాబాద్ జోన్‌లోని డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు సికింద్రాబాద్‌లోని నామాలగుండులో ఉంటున్న ఎం నరేష్‌ ఇంటిపై దాడిచేశారు. ఇతను లైసెన్స్ లేకుండా ఔషధాలు విక్రయిస్తున్నాడని సమాచారం.  అ సందర్భంగా అధికారులు ‘మెఫెంటెర్మైన్ సల్ఫేట్ ఇంజెక్షన్’ అనే కార్డియాక్ స్టిమ్యులేట్ డ్రగ్ నిల్వలను గుర్తించారు. బాడీబిల్డింగ్‌ కోసం జిమ్‌కు వెళ్లేవారికి వీటిని విక్రయిస్తున్నట్లు  కనుగొన్నారు.

మెఫెంటెర్మైన్ సల్ఫేట్ ఇంజెక్షన్ అనేది కార్డియాక్ స్టిమ్యులేట్ ఔషధం. దీనిని ప్రధానంగా శస్త్రచికిత్స సమయంలో.. అనస్థీషియా ఇవ్వడం వల్ల తలెత్తే తగ్గిన రక్తపోటు (హైపోటెన్షన్)ను నియంత్రించేందుకు ఉపయోగిస్తారు. అలాగే హైపోటెన్సివ్ (తక్కువ రక్తపోటు) స్థితులలో రక్తపోటును  చక్కదిద్దేందుకు దీనిని ఉపయోగిస్తారు. ఈ ఔషధం నోరాడ్రినలిన్ విడుదలను పెంచుతుంది. తద్వారా కార్డియాక్ అవుట్‌పుట్‌ పెరుగుతుంది. గుండె పంపింగ్ సామర్థ్యాన్ని పెంచడం, రక్త నాళాలను కుదించడం ద్వారా, ఈ ఔషధం వేగంగా రక్తపోటును పెంచుతుంది. అయితే ఈ ఔషధం మోతాదు, వ్యవధిని సంబంధిత వైద్యుడు మాత్రమే నిర్ణయించాల్సి ఉంటుంది.

మెఫెంటెర్మైన్ సల్ఫేట్ ఇంజెక్షన్‌ను బాడీబిల్డర్లలో ఓర్పును పెంచడానికి అక్రమంగా వినియోగిస్తున్నారు. అయితే ఈ ఇంజెక్షన్ల అనవసరం వినియోగం కారణంగా హృదయ సంబంధిత రుగ్మతలతో సహా శరీరంలో పలు ప్రతికూల ప్రభావాలు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ ఇంజెక్షన్ల వినియోగం చివరికి మరణానికి కూడా దారితీయవచ్చని వారు హెచ్చరిస్తున్నారు. కాగా నామాలగుండుతో దాడులు చేపట్టిన డీసీఏ అధికారులు స్థానికుడు ఎం నరేష్  నుండి టెర్మివా ఇంజెక్షన్లు , టెర్మిన్ ఇంజెక్షన్ల 66 వైల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడిలో సికింద్రాబాద్ అసిస్టెంట్ డైరెక్టర్ డీ సరిత, డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్ బీ గోవింద్ సింగ్, పీ రేణుక,జీ. సురేంద్రనాథ్ తదితర అధికారులు పాల్గొన్నారు. ఈ కేసులో నిందితుడు ఎం సురేష్‌కు ఐదేళ్ల జైలు శిక్ష విధించే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు.
 

Videos

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)