Breaking News

బెట్టింగ్‌ యాప్స్‌ కేసు.. చిరు ప్రస్తావన తెచ్చిన సీపీఐ నారాయణ

Published on Fri, 03/21/2025 - 11:02

న్యూఢిల్లీ, సాక్షి: తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశమైన సెలబ్రిటీల బెట్టింగ్‌ యాప్స్‌ కేసు వ్యవహారంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్రంగా స్పందించారు. చేతి నిండా అవకాశాలు ఉన్నవాళ్లు కూడా తప్పుడు పనులతో డబ్బు సంపాదించుకోవడం ఎందుకు? అని ప్రశ్నించారాయన.

సినీ నటులను ప్రజలు అనుసరిస్తుంటారు. ఆ విషయం వాళ్లు గమనించాలి.  కళామతల్లి ఇచ్చే గుర్తింపును బెట్టింగ్ వంటి తప్పుడు పనులకు దుర్వినియోగం చేయవద్దు.  సినీ నటులు ఇప్పటికే చేతినిండా సంపాదించుకుంటున్నారు. సినిమా అవకాశాలు రాకపోతే.. ఓటీటీ సహా ఎన్నో అవకాశాలు ఉండనే ఉన్నాయి. అలాంటప్పుడు సినిమావాళ్లకు ఈ పాడు సంపాదన దేనికి? 

గుట్కా విషయంలో అప్పట్లో ఒక పనికిమాలిన తీర్పు వచ్చింది. దాన్ని ఆసరా చేసుకుని కొందరు పాన్ పరాగ్ పేరుతో అనైతిక వ్యాపారం చేస్తున్నారు అని మండిపడ్డారాయన. ఈ క్రమంలో గతంలో మెగాస్టార్‌ చిరంజీవికి తాను రాసిన ఓ లేఖ సందర్భాన్ని ఆయన గుర్తు చేశారు. 

గతంలో చిరంజీవి ఓ శీతల పానీయం కంపెనీకి బ్రాండ్‌ అంబాసిడర్‌గా ప్రకటనలు ఇచ్చారు. అప్పుడు ఆయనకు నేనొక లేఖ రాశాను. ఓవైపు రక్తదానం చేస్తూ.. మరోవైపు రక్తాన్ని దెబ్బతీసే డ్రింక్‌లను ఎలా ప్రమోట్ చేస్తారు? అని ఆయన్ని ప్రశ్నించా. కాంట్రాక్టు గడువు ముగిసిన తర్వాత మళ్లీ ఆ ప్రకటనలు చేయనని ఆయన చెప్పారు. ఆ తర్వాత చెయ్యలేదు కూడా’’ అని నారాయణ అన్నారు.

Videos

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

మీ కంటే YSRCP నయం.. 40 సంవత్సరాలు TDPకి పని చేసినందుకు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా..!

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)