Breaking News

ధ్యానంతోనే మానసిక ప్రశాంతత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌

Published on Mon, 12/22/2025 - 05:39

నందిగామ: కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ధ్యానం చేసే అలవాటు చేసుకున్నట్లయితే మానసికంగా ప్రశాంతంగా ఉండగలుగుతారని ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌ అన్నారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా శాంతివనంలోని ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన మందిరంలో హార్ట్‌ఫుల్‌నెస్‌ సంస్థ గురూజీ, శ్రీరామచంద్ర మిషన్‌ అధ్యక్షుడు కమ్లేశ్‌ పటేల్‌ ఆధ్వర్యంలో ఆదివారం ప్రపంచ ధ్యాన దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. 

జిషు్ణదేవ్‌ వర్మ, ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాధాకృష్ణన్‌ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో ధ్యానాన్ని అలవాటుగా చేసుకోవాలని అన్నా రు. ధ్యానంతో అంతర్గత శాంతి లభిస్తుందని, కోపతాపాలు దూరమవుతాయని పేర్కొన్నారు. మధ్యప్రదేశ్‌ పోలీసులు హార్ట్‌ఫుల్‌నెస్‌ సంస్థ ఆధ్వర్యంలో ధ్యానాన్ని అభ్యసిస్తుండటంతో వారిలో గొప్ప మార్పు వచి్చందని గుర్తు చేశారు. గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ మాట్లాడుతూ.. ధ్యానంతో కలిగే ప్రయోజనాలను గుర్తించిన ఐక్యరాజ్యసమితి ఏటా డిసెంబర్‌ 21ని ప్రపంచ ధ్యాన దినోత్సవంగా ప్రకటించిందని తెలిపారు.

ధ్యానం మన అంతర్గత ఉనికిని కనుగొనడంలో ఉపయోగపడుతుందని వివరించారు. గురూజీ కమ్లేశ్‌ పటేల్‌ మాట్లాడుతూ.. ధ్యానం జడత్వాన్ని వదిలి, ఉన్నత చైతన్యాన్ని చేరుకోవడానికి సాధనంగా పనిచేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో 30 వేల మంది ప్రత్యక్షంగా, లక్షలాది మంది వర్చువల్‌గా 170 దేశాల నుంచి పాల్గొంటున్నారని చెప్పారు. అంతకు ముందు గురూజీ కమ్లేశ్‌ పటేల్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన సామూహిక ధ్యానంలో అక్కడికి వచి్చన అతిథులు పాల్గొన్నారు. అనంతరం దాజీ రచించిన ‘రివీల్‌ డార్స్‌’పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో షాద్‌నగర్‌ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి పాల్గొన్నారు. 

ఢిల్లీ చేరుకున్న ఉపరాష్ట్రపతి 
శంషాబాద్‌: రెండు రోజుల హైదరాబాద్‌ పర్యటకు వచ్చిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్‌ ఆదివారం సాయంత్రం తిరిగి ఢిల్లీ చేరుకున్నారు. కన్హాశాంతి వనంలో ప్రపంచ ధ్యాన దినోత్సవంలో పాల్గొన్న అనంతరం ఆయన ప్రత్యేక విమానంలో శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీకి ప్రయాణమయ్యారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)