Breaking News

లగచర్ల కేసులో నేడు తీర్పు

Published on Wed, 12/18/2024 - 04:35

సిటీ కోర్టులు: లగచర్లలో అధికారులపై దాడి కేసులో రైతులు, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి బెయిల్‌ పిటిషన్‌పై నాంపల్లిలోని ఏసీబీ కోర్టులో ఇరుపక్షాల వాదనలు మంగళవారం ముగిశాయి. సొమవారం రైతుల తరఫున సురేందర్‌రావు, జక్కుల లక్ష్మణ్, జి.కిరణ్‌లు వాదనలు వినిపించగా, మంగళవారం పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ కౌంటర్‌ దాఖలు చేసి వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న జడ్జి అఫ్రోజ్‌ అక్తర్‌ తీర్పును రిజర్వ్‌ చేస్తూ బుధవారానికి వాయిదా వేశారు.

మొదటగా పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ వాదన­లు వినిపిస్తూ ఎలక్ట్రానిక్‌ సమాచారంతోపాటు ఘటనకు సంబంధించి కొన్ని ఫొటోలు, వీడియోలు కోర్టుకు సమర్పించారు. వాటిని పరిశీ­లించి వెంటనే జోక్యం చేసుకున్న రైతుల తరఫు న్యాయవాదులు పీపీ దాఖలు చేసిన ఫొటోల్లో ఉన్న ఒక్కరిని కూడా అరెస్ట్‌ చేయలేదని, ఈ ఘటనకు సంబంధం లేని రైతులు, మాజీ ఎమ్మె­ల్యేను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించి ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు.

పబ్లిక్‌ ప్రాసి­క్యూటర్‌ కోర్టుకు సమర్పించిన ఆధారాల్లో ఒక్క­రూ కూడా అరెస్టై రిమాండ్‌లో లేరని గుర్తు చేశా­రు. అయితే మాజీ ఎమ్మెల్యే అక్కడ దాడికి పా­ల్పడిన వ్యక్తితో ఫోన్‌లో మాట్లాడటం, వాట్సా­ప్‌ చాట్‌లు ఉన్నాయని అవన్నీ కోర్టుకు సమర్పించా­మని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ గుర్తుచేశారు. మాజీ ఎమ్మెల్యేతోపాటు రైతుల అనారోగ్యంతో ఇబ్బందు­లు పడుతున్నారని వారి ఆరోగ్యం క్షీణిస్తుందని రైతుల తరఫు న్యాయవాదులు కోర్టు తెలిపారు. ఇ­రుపక్షాల వాదనలు విన్న జడ్జి తీర్పును రిజర్వ్‌ చేశారు. నేడు తీర్పును వెలువరించే అవకాశముంది. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)