Breaking News

నేటి నుంచి పత్తి కొనుగోళ్లు బంద్‌

Published on Mon, 11/17/2025 - 06:23

సాక్షి, హైదరాబాద్‌: పత్తి కొనుగోళ్ల విషయంలో నెలకొన్న గందరగోళానికి తెరపడడం లేదు. కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) తీసుకొచ్చిన నిబంధనలపై నిరసన వ్యక్తం చేస్తూ జిన్నింగ్‌ మిల్లుల యాజమాన్యాలు సోమవారం నుంచి పత్తి కొనుగోళ్లను నిలిపివేయనున్న విషయం తెలిసిందే. ఎల్‌–1, ఎల్‌–2 నుంచి ఎల్‌–12 వరకు మిల్లుల విభజనను వ్యతిరేకిస్తూ మిల్లర్లు ఈనెల 6వ తేదీన బంద్‌కు పిలుపునిచ్చా రు. అయితే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తి మేరకు బంద్‌ ఆలోచనను వాయిదా వేసుకున్నారు. అయితే పదిరోజులైనా నిబంధనల్లో సడలింపులు లేకపోవడంతో సోమవారం నుంచి మిల్లులను బంద్‌ చేయనున్నట్టు ఇటీవల అల్టిమేటం ఇచ్చారు.

అయితే వివిధ మార్కెట్‌లకు పెద్దఎత్తున పత్తి వస్తున్న నేపథ్యంలో బంద్‌ ఆలోచన విరమించుకోవాలని మంత్రి తుమ్మల, వ్యవసాయశాఖ కార్యదర్శి సురేంద్రమోహన్‌తోపాటు ఆయా జిల్లా కలెక్టర్లు జిన్నింగ్‌ మిల్లుల యాజమాన్యాలతో జరిపిన చర్చలు సఫలం కాలేదు. రాష్ట్రంలో సీసీఐ నోటిఫై చేసిన 322 మిల్లులను తెరిపించి, అన్నింటిలో కొనుగోళ్లు జరిపితేనే పత్తి కొనుగోళ్లు సాగుతాయని స్పష్టం చేసినట్టు అసోసియేషన్‌ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి బి.రవీందర్‌రెడ్డి, కక్కిరాల రమేశ్‌ ‘సాక్షి’కి తెలిపారు. బంద్‌ నేపథ్యంలో పత్తిని మిల్లులకు తీసుకురావొద్దని రైతులకు వారు విజ్ఞప్తి చేశారు.

కేంద్ర జౌళిశాఖ అధికారులతో మాట్లాడిన మంత్రి తుమ్మల
పత్తి కొనుగోళ్లు నిలిపివేయాలని జిన్నింగ్‌ మిల్లుల యాజమన్యాలు అల్టిమేటం ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర జౌళిశాఖ అధికారులతో ఆదివారం ఫోన్‌లో మాట్లాడారు. సీసీఐ తీసుకొచ్చిన ఎల్‌–1, ఎల్‌–2..నిబంధనలతో జిన్నింగ్‌ మిల్లర్లు నష్టపోతున్నారని, అన్ని జిన్నింగ్‌ మిల్లులను వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పత్తి రైతులు ఇప్పటికే అకాల వర్షాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సీసీఐ తీసుకొచ్చిన 12 లోపు తేమశాతం, ఎకరానికి 7 క్వింటాళ్ల పరిమితి నిబంధనతో కష్టాలు పడుతున్నారని తెలిపారు.     

మంగళవారం రాష్ట్రానికి సీసీఐ సీఎండీ!
సీసీఐ ఆంక్షలు, జిన్నింగ్‌ మిల్లుల బంద్‌ వంటి అంశాలపై ప్రభుత్వంతో చర్చించేందుకు ఈనెల 18న సీసీఐ సీఎండీ లలిత్‌కుమార్‌ గుప్తా రాష్ట్రానికి రానున్నట్టు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి చేసిన విజ్ఞప్తుల నేపథ్యంలో సీసీఐ సీఎండీని ప్రభుత్వంతో చర్చలకు పంపించినట్టు సమాచారం. కాగా సీసీఐ సీఎండీ వచ్చేంత వరకు ఈ సమస్య పరిష్కారం కాదని తేలిపోవడంతో సోమవారం నుంచి పత్తి కొనుగోళ్లు నిలిచిపోనున్నాయి.  

#

Tags : 1

Videos

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)