Breaking News

ఇక సహకార జనరిక్‌ మెడికల్‌ షాపులు

Published on Sun, 08/06/2023 - 04:07

సాక్షి, అమరావతి: సొసైటీల ఆధ్వర్యంలో సహకార జన ఔషధి కేంద్రాలు రాబోతున్నాయి. ప్రజలకు అత్యంత తక్కువ ధరకు మందులను అందుబా­టులో ఉంచడంతోపాటు ఆదాయ వనరులు పెంపొందించుకోవడమే లక్ష్యంగా ప్రాథమిక వ్యవసా­య పరపతి సంఘాల (పీఏసీఎస్‌ల)కు అనుబంధంగా వీటిని ఏర్పాటు చేయనున్నారు.

ఇప్పటికే వివిధ రకాల వ్యాపారాలతో పీఏసీఎస్‌లు లాభాల బాట పట్టాయి. ఇదే కోవలో నష్టాల్లో ఉన్న సంఘా­లు తమ ఆర్థిక స్థితిని పెంచుకునే దిశగా అడుగు­లేస్తున్నాయి. బహుళ సేవా కేంద్రాలుగా పీఏసీఎస్‌­లను తీర్చిదిద్దే లక్ష్యంలో భాగంగా వీటిని ఏర్పాటు చేస్తున్నారు. జనరిక్‌ మందుల వినియోగంపై ప్రజ­ల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో గ్రామ స్థాయి­లో జన ఔషధి కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు.

ప్రభుత్వాల ఆర్థిక చేయూత
తొలి దశలో జిల్లాకు ఐదు పీఏసీఎస్‌లను ఎంపిక చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 132 పీఏసీఎస్‌­లతో­పాటు 13 డీసీఎంఎస్‌లలో కూడా వీటిని ఏర్పా­టు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రధాన­మంత్రి భారతీయ జన ఔషధి కేంద్రాల పేరిట వీటిని ఏర్పాటు చేస్తున్నారు. వీటికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక చేయూత ఇవ్వనున్నాయి. ఒక్కో జన ఔషధి కేంద్రం ఏర్పాటుకు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల చొప్పున వెచ్చించనున్నారు. వీటిద్వారా నిరుద్యోగ యువతకు పెద్దఎత్తున ఉపాధి కల్పించడంతో పాటు గ్రామీణుల్లో ఆరోగ్య పరిరక్షణ పట్ల అవగాహన పెంపొందిస్తారు.

సొసైటీల ఆధ్వర్యంలో పెట్రోల్‌ బంక్‌లు
స్థలాలు అందుబాటులో ఉన్న 106 పీఏసీ­ఎస్‌లలో ఒక్కొక్క చోట రూ.25 లక్షల అంచ­నా వ్యయంతో పెట్రోల్‌ బంకులు ఏర్పాటు చేస్తున్నారు. స్థలాలు చూపిస్తే చాలు ఫీజుబు­లిటీ రిపోర్టు ఆధారంగా పైసా ఖర్చు లేకుండా డీలర్‌షిప్‌లు మంజూరుకు ఆయిల్‌ కంపె­నీ­లు ముందుకొచ్చాయి. బంక్‌ నిర్మాణా­నికి అవస­రమైన మౌలిక సదుపాయాలను సమ­కూ­రు­స్తున్నాయి.

27 పీఏసీఎస్‌లలో పెట్రోల్‌ బంక్‌ల ఏర్పాటుకు సంబంధిత శాఖలు ఇప్ప­టికే ఎన్‌వోసీలు ఇచ్చాయి. ఆరు చోట్ల పెట్రో­ల్‌ బంక్‌లు ప్రారంభించారు. మిగిలిన 83 పీఏసీ­ఎస్‌ల ఆధ్వర్యం బంక్‌ల ఏర్పాటుకు అవ­స­రమైన ఎన్‌వోసీలను సాధ్యమైనంత త్వరగా సాధించే దిశగా సహకార శాఖ చర్య­లు చేప­ట్టింది. అదే బాటలో ఎంపిక చేసిన పీఏసీ­ఎస్‌­లలో జన ఔషధి కేంద్రాలు ఏర్పా­టు చేసేం­దుకు సన్నాహాలు చేస్తున్నారు.

సొసైటీల బలోపేతమే లక్ష్యం
నష్టాల్లో ఉన్న సొసైటీలను లాభాల బాట పట్టించడమే లక్ష్యంగా కార్యాచరణ సిద్ధం చేస్తున్నాం. పెట్రోల్‌ బంక్‌లు ఏర్పాటుకు అవసరమైన ఎన్‌వోసీల జారీలో జాప్యాన్ని నివారించేందుకు సంబంధిత జిల్లాల జాయింట్‌ కలెక్టర్ల సమన్వయంతో ముందుకెళ్తున్నాం. పెట్రోల్‌ బంకులు, జన ఔషధి కేంద్రాలతో పాటు స్థానిక డిమాండ్‌ ఉన్న వ్యాపారాలు చేసుకునే వెసులుబాటును సొసైటీలకు కల్పిస్తున్నాం. – కాకాణి గోవర్ధన్‌రెడ్డి, వ్యవసాయ, సహకార శాఖల మంత్రి

Videos

భారీగా తగ్గిన బంగారం ధర

దీపా జ్యువెల‌ర్స్‌కు ఇన్వెస్ట‌ర్ల క్యూ అన్ని కోట్లు వ‌స్తాయా?

ప్రభుత్వ హామీలపై బాబుపై రెచ్చిపోయిన వెంక ట్రామిరెడ్డి

టెట్ లేకుండా ఉద్యోగాలా? DSC అక్రమాలపై YSRCP ఎమ్మెల్సీల దీక్ష

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు