Breaking News

అంతా నా ఇష్టం..

Published on Mon, 05/19/2025 - 12:41

నంగునూరు(సిద్దిపేట): ఓ మహిళా హెడ్‌ కానిస్టేబుల్‌ తీరు వివాదాస్పదంగా మారుతోంది. ఇష్టారాజ్యంగా విధులు నిర్వహిస్తుండటంతో పోలీసులకు సైతం తలనొప్పులను తెస్తోంది. ఇటీవల ఫిర్యాదు చేసేందుకు పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన బాధితుల ఎదుటే సిబ్బందిపై చిందులు తొక్కడంతో అక్కడే ఉన్న ఎస్‌ఐ, పోలీసులు అవాక్కయ్యారు. ఇంత జరుగుతున్నా ఆమెపై ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంతో సివిల్‌ వివాదాల్లో సహితం జోక్యం చేసుకుంటున్నారు. 

రెండు రోజుల కిందట ఏకంగా మండల మెజి్రస్టేట్, తహసీల్దార్‌కు ఫోన్‌ చేసి రిజి్రస్టేషన్‌ ఆపాలని చెప్పడంతో ఆమె ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. రాజగోపాల్‌పేట పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఓ హెడ్‌ కానిస్టేబుల్‌.. రిసెప్షన్‌ గదిలో విధులు నిర్వహిస్తున్నారు. ఫిర్యాదు చేసేందుకు బాధితులు ముందుగా ఆమెనే కలవాల్సిరావడం అనుకూలంగా మార్చుకున్నారు. కేసులకు సంబంధించిన ఫిర్యాదులో జోక్యం చేసుకుంటూ బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. వారం రోజుల కిందట తనపై అధికారిపై ఎస్‌ఐ, సిబ్బంది, బాధితుల ఎదుటే వాగ్వాదానికి దిగినట్లు తెలిసింది.  

రిజిస్ట్రేషన్‌ ఆపాలంటూ తహసీల్దార్‌కు ఫోన్‌.. 
నంగునూరుకు చెందిన ఓ వ్యక్తి తన కూతురు పేరిట రెండెకరాల భూమి రిజిస్ట్రేషన్‌ చేసేందుకు శనివారం స్లాట్‌ బుక్‌ చేసుకున్నాడు. రిజి్రస్టేషన్‌ చేయొద్దని అతని కుమారుడు అడ్డు చెప్పడంతో వివాదం రాజగోపాల్‌పేట పోలీస్‌స్టేషన్‌కు వెళ్లింది. ఈ విషయంపై మహిళా హెడ్‌కానిస్టేబుల్‌         రిజి్రస్టేషన్‌ ఆపాలని తహసీల్దార్‌కు ఫోన్‌ చేయడంతో ఆశ్చర్యానికి గురైన సదురు అధికారి.. ఎస్‌ఐకి,  మరో ఉన్నతాధికారికి ఫోన్‌ చేసిన ఫిర్యాదు చేసినట్లు సమాచారం. 

రిసెప్షనిస్ట్‌ విధుల నుంచి తొలగించాం 
ఈ విషయమై రాజగోపాల్‌పేట ఎస్‌ఐ ఎండీ అసీఫ్‌ను వివరణ కోరగా.. మహిళా హెడ్‌ కానిస్టేబుల్‌ తహసీల్దార్‌కు ఫోన్‌ చేయడం నిజమేనన్నారు. 

దీంతో తహసీల్దార్‌ సరిత తనతో పాటు ఏసీపీతో ఫోన్‌లో మట్లాడారన్నారు. ఆమెను రిసెప్షనిస్ట్‌ విధుల నుంచి తొలగించి సాధారణ విధులు అప్పగించామన్నారు.

 

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)