Breaking News

కులగణన నేపథ్యంలో ప్రభుత్వం కీల‌క‌ నిర్ణయం.. ఒక్క పూటే బ‌డులు

Published on Wed, 11/06/2024 - 00:42

సాక్షి, హైదరాబాద్‌:  తెలంగాణ‌ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను బుధవారం నుంచి ఒంటిపూట మాత్రమే నిర్వహిస్తారు. కులగణన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఎస్‌జీటీల సేవలను సర్వేకు ఉపయోగిస్తున్నందున, మధ్యాహ్నం నుంచి పాఠ శాలలను మూడు వారాల పాటు మధ్యాహ్నం ఒంటిగంట వరకూ నడపాలని పాఠశాల విద్య డైరెక్టరేట్‌ ఆదేశించింది. మధ్యాహ్న భోజనం తర్వాత విద్యార్థులను ఇళ్లకు పంపుతారు.

టెట్‌ బులెటిన్‌ విడుదల రేపు 
సాక్షి, హైదరాబాద్‌: ఉపాధ్యాయ అర్హత పరీక్షకు సంబంధించిన ఇన్ఫర్మేషన్‌ బులెటిన్‌ను ఈ నెల 7వ తేదీన విడుదల చేయనున్నట్టు పాఠశాల విద్య డైరెక్టరేట్‌ ఒక ప్రకటనలో తెలిపింది. వాస్తవానికి ఈ బులెటిన్‌ను మంగళవా రం విడుదల చేయాల్సి ఉంది. సాంకేతిక కారణాల వల్ల సాధ్యం కాలేదని పేర్కొంది.

ఎంబీఏ సాయంకాలపు కోర్సుల ప్రవేశ పరీక్ష 17కు వాయిదా  
ఉస్మానియా యూనివర్సిటీ: ఈ నెల 9న జరగాల్సిన ఓయూ ఎంబీఏ సాయంకాలపు కోర్సుల ప్రవేశ పరీక్షను నవంబర్‌ 17కు వాయిదా వేశారు. వర్సిటీ క్యాంపస్‌లోని కామర్స్‌ అండ్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ కళాశాలలో సాయంకాలపు కోర్సులైన ఎంబీఏ, ఎంబీఏ టెక్నాలజీ మేనేజ్‌మెంట్‌ (టీఎం) ప్రవేశ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ఈ నెల 14 వరకు రూ.500 అపరాధ రుసముతో దరఖాస్తు చేసుకోవచ్చని పీజీ అడ్మిషన్స్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ పాండురంగారెడ్డి తెలిపారు.

ముగిసిన వివిధ సెట్ల కౌన్సెలింగ్‌ 
ఉస్మానియా యూనివర్సిటీ: ఈ విద్యా సంవత్సరానికి వివిధ సెట్ల కౌన్సెలింగ్‌ పక్రియ ముగిసిందని కన్వీనర్‌ ప్రొఫెసర్‌ రమేశ్‌బాబు మంగళవారం తెలిపారు. పీజీ లాసెట్, లాసెట్‌–2024, పీజీఈసెట్‌–2024, ఎడ్‌సెట్‌– 2024, పీఈసెట్‌–2024 తదితర సెట్ల కౌన్సెలింగ్‌ ద్వారా సీట్లు భర్తీ చేసిన్నట్లు చెప్పారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)