Breaking News

నిర్మాణ భారం

Published on Sat, 06/06/2026 - 02:26

సాక్షి, హైదరాబాద్‌: వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తుల విలువల సవరణలో భాగంగా నిర్మాణ విలువలను కూడా రాష్ట్ర ప్రభుత్వం సవరించింది. అయితే ఈ నిర్మాణ విలువల సవరణ ప్రక్రియపై పెద్దగా చర్చ జరగకుండానే కొత్త విలువలు అమల్లోకి వచ్చిన రోజున నేరుగా కార్డ్‌ సాఫ్ట్‌వేర్‌లో అప్‌లోడ్‌ చేసింది.

కొత్త విలువల ప్రకారం రీయిన్‌ఫోర్స్‌డ్‌ సిమెంట్‌ కాంక్రీట్‌ (ఆర్‌సీసీ) కేటగిరీలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో రూ.250, రూ.200 చొప్పున సవరించగా, నాన్‌ ఆర్‌సీసీ కేటగిరీలో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ నిర్మాణ విలువను చదరపు అడుగుకు రూ.150 చొప్పున సవరించింది. కాగా, కొత్త విలువలు అమలైన తొలిరోజు రిజిస్ట్రేషన్‌ కార్యకలాపాలు సాఫీగానే సాగిపోయాయి. చిన్నచిన్న సాఫ్ట్‌వేర్‌ సమస్యలు వచ్చినా ఉన్నతాధికారులు వెంటనే స్పందించారని సమాచారం.  

చివరి రోజు భారీగా లావాదేవీలు 
పాతవిలువలు అమల్లో ఉన్న చివరి రోజు గురువారం పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్‌ లావాదేవీలు జరిగాయని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ ఒక్కరోజే వ్యవసాయేతర భూములు, ఆస్తులకు సంబంధించి 8,200కు పైగా రిజిస్ట్రేషన్లు జరిగినట్టు తెలుస్తోంది. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌తో కలిసి ఈ సంఖ్య 10,700 దాటడం గమనార్హం. ఈ నెలలో తొలి నాలుగు రోజుల్లోనే 22వేలకు పైగా రిజిస్ట్రేషన్‌ లావాదేవీలు జరిగాయి. వ్యవసాయ భూముల లావాదేవీలతో కలిపితే ఈ సంఖ్య 34 వేలకు చేరింది. అంటే సగటున రోజుకు 8,500 వరకు లావాదేవీలు జరిగాయన్నమాట.

అయితే వ్యవసాయేతర భూములు, ఆస్తుల లావాదేవీలు మాత్రం సగటున రోజుకు 5 వేలు జరిగాయి. వాస్తవానికి సాధారణ రోజుల్లో రోజుకు సగటున 2 వేల వరకు వ్యవసాయేతర లావాదేవీలు జరుగుతుండగా, విలువల సవరణకు నాలుగు రోజుల ముందు సగటున 5 వేలకు పైగా లావాదేవీలు జరగడం గమనార్హం. కొత్త విలువలు అమలైన శుక్రవారం తొలిరోజు 3,200కు పైగా వ్యవసాయేతర లావాదేవీలు జరిగాయని గణాంకాలు చెబుతున్నాయి.

భూభారతి పోర్టల్‌ ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల కోసం పాత విలువలు అమల్లో ఉన్న చివరి రోజు గురువారం 3,506 దరఖాస్తులు వచ్చాయి. అందులో 2,515 లావాదేవీలను పూర్తి చేశారు. ఈ నెల తొలి నాలుగు రోజుల్లో మొత్తం 17 వేలకు పైగా దరఖాస్తులు రాగా, అందులో 12 వేల వరకు లావాదేవీలు పూర్తయ్యాయి. అంటే భూభారతి పోర్టల్‌లో కూడా ఈ నెలలో సగటున రోజుకు 3వేలకు పైగా లావాదేవీలు పూర్తయ్యాయన్నమాట. కొత్త విలువలు అమల్లోకి వచ్చిన తర్వాత తొలి రోజు శుక్రవారం వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల కోసం 3వేల వరకు దరఖాస్తులు రాగా, అందులో 1,500 వరకు లావాదేవీలు పూర్తి చేసినట్టు సమాచారం.  



విలువల సవరణపై అధికారిక ప్రకటన 
రాష్ట్రంలో భూములు, ఆస్తుల విలువలను ఎలా సవరించామన్న దానిపై స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటన ప్రకారం రాష్ట్రంలోని 8 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలోని వాణిజ్య అపార్ట్‌మెంట్లలో గ్రౌండ్‌ ఫ్లోర్‌ విలువలను 11 శాతం తగ్గించారు.  

⇒ రంగారెడ్డి (ఆర్‌ఓ), శేరిలింగంపల్లి, గండిపేట, శంషాబాద్, మేడ్చల్‌ (ఆర్‌ఓ), వల్లభ్‌నగర్, బాలానగర్, కూకట్‌పల్లి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల పరిధిలో ప్రస్తుతం కమర్షియల్‌ అపార్ట్‌మెంట్స్‌లోని గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఒక చదరపు అడుగు రూ.7,300, మిగతా ఫ్లోర్లలో ఒక చదరపు అడుగు రూ.6,600 ఉండగా ఇప్పుడు అన్నీ ఫ్లోర్లలో ఒకే విలువ రూ.6,600 గా నిర్ణయించారు. 

⇒ వల్లభ్‌నగర్‌లో గ్రౌండ్‌ ఫ్లోర్‌ ఒక చదరపు అడుగు రూ.8,600 ఉండగా, మిగతా ఫ్లోర్లలో రూ.7,800 ఉండగా ఇప్పుడు అన్నీ ఫ్లోర్లలో రూ.7,800లుగా నిర్ణయించారు.  

⇒ నివాస అపార్ట్‌మెంట్లకు సంబంధించి చిక్కడపల్లి, లోయర్‌ ట్యాంక్‌బండ్, హిమాయత్‌నగర్, హైదర్‌గూడ లాంటి ప్రాంతాల్లో పెంచలేదు.  

⇒ బంజారాహిల్స్‌లో ఉన్న రూ.4,500, ఫిల్మ్‌నగర్‌లో ఉన్న రూ.4,800 విలువను యథాతథంగా కొనసాగించారు.  
⇒ పుప్పాలగూడ, నార్సింగి, ఆదిబట్లలో ఒక చదరపు అడుగు రూ.2,200 నుంచి రూ.2,700కు పెంచారు.  

⇒ బంజారాహిల్స్‌లో కమర్షియల్‌ అపార్ట్‌మెంట్స్‌కు చదరపు అడుగు రూ.7,600 నుంచి రూ.8,400 కు పెంచారు. మొత్తంగా నివాస, వాణిజ్య అపార్ట్‌మెంట్స్‌లో 10 నుంచి 20 శాతం వరకు మాత్రమే విలువలు సవరించారు.  

⇒ ఆదిలాబాద్, జనగాం, భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, కరీంనగర్, మంచిర్యాల, జయశంకర్‌ భూపాలపల్లి, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, నల్లగొండ, నారాయణపేట, నిజామాబాద్, పెద్దపల్లి, రంగారెడ్డి జిల్లాల్లోని 65 గ్రామాల్లో వ్యవసాయ భూముల విలువలు పెంచలేదు.  

⇒ మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లోని ఉప్పల్, కాప్రా, పటాన్‌చెరు, హయత్‌నగర్‌లలో 15 శాతం, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా ఆల్వాల్, ఘట్‌కేసర్, కుత్బుల్లాపూర్, ఉప్పల్, సరూర్‌నగర్, శేరిలింగంపల్లిలలో 25 శాతం పెంచారు.  

⇒  ఖాళీ ప్లాట్ల విషయానికి వస్తే ఆమనగల్లు మున్సిపాలిటీలో గజం విలువ రూ.3,200, రావిర్యాలలో రూ.4,900, పుప్పాలగూడలో రూ.36,800, నార్సింగిలో రూ.27,000, కోకాపేటలో రూ.47,600, గండిపేటలో రూ.22,600, అత్తాపూర్‌లో రూ.30,500, కందుకూరులో రూ.4,900, బంజారాహిల్స్‌లో రూ.1,16,000 (కమర్షియల్‌), ఉప్పల్‌లో రూ.25,200, హబ్సిగూడలో రూ.46,800, జనగాంలో రూ.3,200, వేములవాడలో రూ.4,800, నాచారంలో రూ.25,400, నాగోల్‌లో రూ.25,200, బైరామల్‌గూడలో రూ.24,300గా నిర్ణయించినట్టు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ వెల్లడించింది. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)