Breaking News

బత్తిని శశికాంత్‌ ఇంట్లో పోలీసుల దొంగతనం

Published on Fri, 11/28/2025 - 08:44

సాక్షి, హైదరాబాద్‌: నకిలీ ఐపీఎస్, ఐఏఎస్‌ అధికారిగా చలామణి అయిన బత్తిని శశికాంత్‌ బిల్డర్లు, బడాబాబులకు టోకరా వేశాడు. ఈ ‘దొంగ పోలీసు’ ఇంట్లో మాత్రం పోలీసులు ‘దొంగలు’గా మారారు. ఈ వ్యవహారం పంపకాల్లో తేడా రావడంతో వెలుగులోకి వచ్చింది. దీనిపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. ఇప్పటికే ఒక రోలెక్స్‌ వాచీ స్వాధీనం చేసుకున్న అధికారులు మిగిలిన వాటిపై లోతుగా ఆరా తీస్తున్నారు.  

ప్రాథమిక దర్యాప్తులో భాగంగా.. 
ఏపీలోని కర్నూలు జిల్లా నందికొట్కూరుకు చెందిన బత్తిని శశికాంత్‌ నగరంలోని షేక్‌పేటలోని అపర్ణా ఔరా అపార్ట్‌మెంట్స్‌లోని ఖరీదైన ఫ్లాట్‌లో ఉండేవాడు. తేలిగ్గా డబ్బు సంపాదించాలని భావించిన ఈ బీకాం గ్రాడ్యుయేట్‌ నకిలీ ఐపీఎస్, ఐఏఎస్‌ అధికారి అవతారం ఎత్తాడు. తెలంగాణ స్టేట్‌ ఇండ్రస్టియల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌లో పని చేస్తున్నానని, జాతీయ దర్యాప్తు సంస్థలో ఉన్నతాధికారినంటూ నమ్మబలికాడు. పలువురు బిల్డర్లు, వ్యాపారవేత్తలతో పాటు బడాబాబుల నుంచి భారీ మొత్తం స్వాహా చేశాడు. ఇతడి వ్యవహారాలపై సమాచారం అందుకున్న ఫిల్మ్‌నగర్‌ పోలీసులు తక్షణం కేసు నమోదు చేశారు. ప్రాథమిక దర్యాప్తు అనంతరం బుధవారం తెల్లవారుజామున శశికాంత్‌ను అరెస్టు చేశారు.  

సోదాలు చేస్తూ.. 
ఇంత వరకు కథ సజావుగానే నడిచింది. సాధారణంగా ఇలాంటి కేసుల్లో అరెస్టుతో పాటు రికవరీలకు పోలీసులు ప్రాధాన్యం ఇస్తారు. అప్పుడే బాధితులకు అవసరమైన స్థాయిలో ఊరట లభిస్తుంది. దీనికోసం నిందితులు, వారి సంబంధీకులతో పాటు అనుమానాస్పద ప్రాంతాల్లో సోదాలు చేస్తారు. ఇందులో భాగంగా బుధవారం తెల్లవారుజామున పోలీసులు షేక్‌పేటలోని అపర్ణ ఔరా అపార్ట్‌మెంట్‌లో ఉన్న శశికాంత్‌ ఫ్లాట్‌కు వెళ్లారు. సాక్షుల సమక్షంలో తాళం తీసి, వీడియోగ్రఫీ మధ్య సోదాలు నిర్వహించారు. ఆ సమయంలో ఈ పోలీసు బృందంలో ఉన్న ఓ కానిస్టేబుల్‌ కళ్లు నిందితుడి వార్డ్‌రోబ్‌లో ఉన్న ఖరీదైన రోలెక్స్‌ వాచీపై పడింది. వీడియో కెమెరాకు చిక్కకుండా ఆ వాచీని చేజిక్కించుకోగలిగినా.. అదే బృందంలో ఉన్న మరో కానిస్టేబుల్‌ కంట్లో పడ్డాడు. దీంతో అతడు మరికొన్ని వస్తువుల్ని కాజేశాడు.  

పంపకాల్లో తేడాలు రావడంతో.. 
ఆనక వాటి పంపకాల విషయంలో వీరి మధ్య విభేదాలు తతెత్తాయి. దీంతో పరిస్థితి ఒకరిపై ఒకరు దాడి చేసుకునే వరకు వెళ్లింది. అలా ఈ పోలీసు ‘దొంగతనం’ వెలుగులోకి రావడంతో ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. దీనిపై సమగ్ర విచారణ జరపాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే దాదాపు విచారణ పూర్తి చేసిన అధికారి రోలెక్స్‌ వాచీతో పాటు మరికొన్ని వస్తువులు స్వా«దీనం చేసుకున్నట్లు తెలిసింది. ఈ కానిస్టేబుళ్ల వ్యవహారంపై ఉన్నతాధికారులకు నివేదిక అందించారని సమాచారం. ఒకటి రెండు రోజుల్లో వారిపై చర్యలకు రంగం సిద్ధమవుతోంది.  

Videos

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)