Breaking News

మరోసారి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి హత్యకు కుట్ర? 

Published on Sat, 02/18/2023 - 00:45

ఖలీల్‌వాడి: ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిపై మరోమారు హత్యకు కుట్ర జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శుక్రవారం నగరంలోని నిజామాబాద్‌ రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధి కేసీఆర్‌ కాలనీ న్యూ హౌసింగ్‌ బోర్డులో బొంత సుగుణ అనే మహిళ ఇంట్లో పోలీసులు పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారం మేరకు రూరల్‌ ఎస్‌హెచ్‌వో లింబాద్రి తనిఖీలు చేపట్టారు.

95 జిలెటెన్‌ స్టిక్స్, 10 డిటోనేటర్లను స్వాధీనం చేసుకున్నారు. మహిళను అదుపులోకి తీసుకొని విచారించగా మాక్లూర్‌ మండలం కల్లెడ సర్పంచ్‌ భర్త ప్రసాద్‌ గౌడ్‌ తన ఇంట్లో వీటిని పెట్టినట్లు తెలిపింది. ప్రసాద్‌ గౌడ్‌ గత ఏడాది ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిపై హైదరాబాద్‌లో హత్యాయత్నం కేసులో చంచల్‌గూడ జైలుకు వెళ్లాడు.  జనవరి 9న జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన తర్వాత జిలెటిన్‌ స్టిక్స్, డిటోనేటర్లను కొనుగోలు చేసి మహిళ ఇంట్లో దాచిపెట్టాడని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ప్రసాద్‌గౌడ్‌ ఒకరిపై కత్తితో దాడిచేసిన కేసులో నిజామాబాద్‌ జిల్లా జైలులో ఉన్నాడు.  

Videos

Fire accident : చార్మినార్ ప‌రిధిలో భారీ అగ్నిప్రమాదం

కోనేరులోకి దూసుకెళ్లిన ఇన్నోవా.. తప్పిన పెను ప్రమాదం

తెలుగు ప్రజలకు YS జగన్ దసరా శుభాకాంక్షలు

పులివెందులలో ఖాకీ కుట్ర.. YSRCP శ్రేణులపై ఏకే 47తో కాల్పులు..

రెండు కాళ్లు లేని దివ్యాంగుడిపై దాడి.. టీడీపీ నేతల దాష్టీకం

కివీస్ తో పోరుకు బుల్డోడు అసలు కారణం ఇదే

నీ బెదిరింపులకు ఎవరూ భయపడరు దీప్తి రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఐదు రౌండ్ల కాల్పులు.. టైగర్ ష్రాఫ్ కేసులో కీలక మలుపు..!

నాకు అంత కోపం రావడానికి కారణం.. నామినేషన్ వేసేటప్పుడు అసలు ఏం జరిగిందంటే

లోకల్ వార్ రెండో దశ మొదలు

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)