Breaking News

నిజామాబాద్ మేయర్ పీఠంపై కాంగ్రెస్.. కుదిరిన పొత్తు..!

Published on Sun, 02/15/2026 - 18:06

 సాక్షి నిజామాబాద్ : నిజామాబాద్ మేయర్ పీఠంపై చిక్కుముడి వీడింది.  కాంగ్రెస్‌కు మేయర్ పదవి, ఎంఐఎంకు డిప్యూటీ మేయర్ పదవి షేర్ చేసుకునేలా అంగీకారం కుదిరింది. ఈ మేరకు  కాంగ్రెస్‌, ఎంఐఎం పార్టీల మధ్య ఈ మేరకు అంగీకారం కుదిరినట్లు సమాచారం. నగరపాలక సంస్థకు మెుత్తం 60 డివిజన్లు ఉండగా బీజేపీ 28 స్థానాలతో అతిపెద్ద పార్టీగా నిలిచింది. కాంగ్రెస్‌కు 17, ఎంఐఎంకు 14, బీఆర్ఎస్‌కు ఒక స్థానం లభించింది. దీంతో కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి.

అయితే ఏ పార్టీకి కూడా మ్యాజిక్‌ ఫిగర్‌ సీట్లు రాకపోవడంతో నిజామాబాద్‌లో హంగ్‌ ఏర్పడింది. దీంతో ఇందూరులో రాజకీయంగా ఆసక్తికర వాతావరణం నెలకొంది. బీజేపీ  అత్యధిక సీట్లు గెలిచినప్పటికీ మేయర్ అయ్యే ఛాన్స్ లేకపోవడంతో కాంగ్రెస్ పావులు కదిపింది. అయితే కాంగ్రెస్ మేయర్‌ అభ్యర్థిగా ఉన్న కాటిపల్లి శమంత 19వ డివిజన్‌ నుంచి పోటీ చేసి ఓడిపోవడంతో కాంగ్రెస్‌ పార్టీకిలోనే మరికొందరు మేయర్‌ స్థానానికి పోటీపడుతున్నారు. 21వ డివిజన్‌ నుంచి గెలిచిన పంచరెడ్డి లలిత, 49వ డివిజన్‌ నుంచి గెలిచిన కూరగాయల ఉమారాణి, 41వ డివిజన్‌ నుంచి గెలిచిన బొంబోతుల పుజిత, 12వ డివిజన్‌ నుంచి గెలిచిన దూమాల అరుంధతి, అలాగే 9వ డివిజన్‌ నుంచి గెలిచిన కేతావత్‌ సురేఖలు మేయర్‌ రేసులో ఉన్నారు. 

మొత్తం ఐదుగురు మహిళలు పోటీలో ఉండగా నలుగురు బీసీలు, ఒకరు ఎస్టీ ఉన్నాట్లు తెలుస్తోంది. అయితే గతంలో కూడా ఇక్కడ హంగ్ వచ్చింది.  ఈ కార్పొరేషన్‌లో బీజేపీ ఎంపీ ధర్మపురి అరి్వంద్, నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణ, ఆర్మూర్‌ ఎమ్మెల్యే పైడి రాకేష్‌ రెడ్డి, కాంగ్రెస్‌కు చెందిన నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ భూపతిరెడ్డి, ఎమ్మెల్సీ మహేశ్‌ కుమార్‌గౌడ్‌ ఎక్స్‌ అఫీషియో ఓట్లు నమోదు చేసుకున్నా రు. దీంతో బీజేపీకి మూడు, కాంగ్రెస్‌కు రెండు ఓట్లు పెరిగినట్‌లైంది. బీఆర్‌ఎస్‌ అభ్యరి్థ ని మినహాయించినప్పటికీ కాంగ్రెస్‌–ఎంఐఎం కూటమికి 33 ఓట్లు అవుతాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ మేయర్ పీఠం చేజిక్కించుకుంది.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)