Breaking News

Telangana: కాంగ్రెస్‌ ఎమ్మెల్యే భార్య ఆత్మహత్య.. కారణం ఇదే?

Published on Fri, 06/21/2024 - 07:08

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కరీంనగర్‌ జిల్లాలోని చొప్పదండి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సతీమణి రూపాదేవి ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్‌లో అల్వాల్‌లోని పంచశీల కాలనీలోని ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రూపాదేవి గురవారం రాత్రి అల్వాల్‌లోని పంచశీల కాలనీలోని ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నారు. ఇక, ఆమె ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం రూపాదేవి మృతదేహాన్ని కొంపల్లిలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు పోలీసులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  

కాగా, రూపాదేవి వికారాబాద్‌ జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. ఎమ్మెల్యే దంపతులకు ఇద్దరు పిల్లలు. అయితే, రూపాదేవి రెండు రోజుల నుంచి స్కూలుకు వెళ్లలేదు. మరోవైపు.. ఎమ్మెల్యే మేడిపల్లి ఉదయమే నియోజకవర్గానికి వెళ్లారు. సాయంత్రం వరకు అక్కడే ఉన్నారు. ఈ  సమయంలోనే ఆమె ఆత్మహత్య చేసుకున్నారు. 

అయితే, రూపాదేవి అనారోగ్య సమస్యల కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఆమె గత రెండు సంవత్సరాల నుంచి తీవ్ర కడుపునొప్పి సమస్యతో బాధపడుతున్నట్టు తెలిపారు. ఈ కారణంగానే రెండు రోజులుగా స్కూల్‌కి సెలవు తీసుకొని ఇంట్లోనే ఉంటున్నారు. మరోవైపు.. రూపాదేవి కుటుంబ సభ్యుల స్టేట్‌మెంట్‌ను పోలీసులు రికార్డు చేశారు. ఇక, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్నీ గాంధీ ఆసుపత్రికి తరలించారు. 
 

Videos

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)