Breaking News

TG: రూ. 8 కోట్లకు పైగా ఆస్తి పన్ను ఒకేసారి..

Published on Fri, 01/30/2026 - 17:51

నిజామాబాద్ : నిజామాబాద్‌ మున్సిపల్ ఖజానాకు కాసుల వర్షం కురుస్తోంది. మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌ అభ్యర్థి ఒకరు కోట్లలో ఆస్తి పన్ను చెల్లించారు. రూ. 8 కోట్లకు పైగా ఆస్తి పన్ను చెల్లించారు కాంగ్రెస్‌ అభ్యర్థి. 2009 నుంచి ఆస్తి పన్ను బకాయిపడ్డారు సదరు అభ్యర్థి.  అయితే ఎన్నికల బరిలో ఉండటంతో నో డ్యూస్‌ కోసం బకాయిలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

దాంతో ఒకేసారి పెద్ద మొత్తంలో బకాయిలు చెల్లించారు. 8 కోట్ల 16 లక్షల 65 వేల రూపాయిలను ఆస్తి పన్ను రూపంలో చెల్లించారు. ఇంత పెద్ద మొత్తంలో బకాయిలు చెల్లించడంతో కార్పొరేషన్‌ వర్గాల్లో చర్చకు దారి తీసింది. అదే సమయంలో వందలాది మంది అభ్యర్థులు పన్ను బకాయిలు చెల్లించారు. ఒక్క కార్పొరేషన్‌లోనే రూ. రూ. 8.5 కోట్లకు పైగా బకాయిల వసూలైనట్లు తెలుస్తోంది.   

కాగా, తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థులు తమ నామినేషన్లను రిటర్నింగ్ అధికారుల వద్ద సమర్పించారు. సాయంత్రం ఐదు గంటల వరకు కార్యాలయంలో ఉన్న అభ్యర్థుల నామినేషన్లను అధికారులు స్వీకరించారు.

రేపు నామినేషన్ల పరిశీలన జరగనుంది. ఈ సందర్భంగా నామినేషన్ రిజెక్ట్ అయిన అభ్యర్థులకు రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) అప్పీల్ చేసుకునే అవకాశం కల్పించింది. ఫిబ్రవరి 1న రిజెక్ట్ పై అప్పీల్ చేసుకున్న అభ్యర్థుల కేసులను ఫిబ్రవరి 2న అధికారులు పరిశీలించనున్నారు.

ఫిబ్రవరి 3వ తేదీ నాటికి ఉపసంహరణ ప్రక్రియ పూర్తవుతుంది. అదే రోజున తుది అభ్యర్థుల జాబితాను రిటర్నింగ్ అధికారులు ప్రకటించనున్నారు. దీంతో ఎన్నికల పోరాటంలో నిలిచే అభ్యర్థుల తుది జాబితా స్పష్టతకు వస్తుంది. ఫిబ్రవరి 11న పోలింగ్ జరగనుంది. అదే రోజు ఓట్ల లెక్కింపు జరుగనుంది. 

Videos

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

నేను తాడిపత్రి పోతా.. ఏం పీకుతారో పీక్కోండి.. మాస్ వార్నింగ్

మరి గోరం... హీరోయిన్ ఎంగిలి చేసిన బాటిల్ ధర రూ.3 లక్షలు..!

అనంతపురం రూరల్ EX ZPTCపై పోలీసుల ఓవర్ యాక్షన్

జోగి రమేష్ హౌస్ అరెస్ట్

ఆ 15 స్థానాల్లో పోటీయే లేదు..! లైవ్ లో మొత్తం బయటపెట్టిన YS జగన్

Photos

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)

+5

ప్రభాస్ హీరోయిన్ కొత్త ఫొటోలు! (ఫొటోలు)

+5

సన్ ఫ్లవర్ తో రితికా నాయక్‌ (ఫొటోలు)