Breaking News

తికమక తెలుగుతో ప్రయాణికుల తకరారు 

Published on Sat, 09/02/2023 - 03:21

సాక్షి, హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో రైళ్ల రాకపోకల సమాచారం తెలిపే ఎల్రక్టానిక్‌ డిస్‌ప్లే బోర్డుల్లో వినియోగిస్తున్న సరికొత్త భాష ప్రయాణికులను గందరగోళం, అయోమయానికి గురి చేస్తోంది. సహజంగా ఊరి పేరు డిస్‌ప్లే చేస్తారు. కానీ ఘనత వహించిన దక్షిణ మధ్య రైల్వేలో మాత్రం ఊళ్ల పేర్లకు అర్ధాలు వెదికీ మరీ ప్రయాణికుల ముందుంచుతున్నారు. అది కూడా గూగుల్‌తో అనుసంధానించి మరీ తర్జుమా చేస్తున్నారు. దాంతో ప్రయాణికులకు సమాచారం ఇవ్వటం అటుంచి.. వారిని మరింత తికమకపెట్టి అయోమయానికి గురి చేస్తున్నారు. 

♦ దేశంలోని ప్రధాన రైల్వే స్టేషన్లలో ఒకటైన సికింద్రాబాద్‌ స్టేషన్‌లో ఈ తికమక తంతు ఎలా ఉందో కళ్లకు కట్టే ఉదాహరణ ఇది. దక్షి ణ మధ్య రైల్వే ప్రధాన కేంద్రంగా ఉన్న రైల్‌ నిలయానికి అతి సమీపంలో ఉన్న ఈ స్టేషన్‌లో నిత్యం లక్షల మంది ప్రయాణికులు కళ్లప్పగించి చూసే రైళ్ల వివరాలను తెలిపే ఎలక్ట్రానిక్‌ డిస్‌ప్లే బోర్డు ఇది.  
♦  తమిళనాడులోని ఎరోడ్‌ పట్టణానికి వెళ్లే స్పెషల్‌ రైలుకు సంబంధించి వివరాలు డిస్‌ప్లే బోర్డు మీద కనిపిస్తున్నప్పుడు ఇంగ్లీష్, హిందీలో సరిగానే ఉంది. కానీ తెలుగులో ప్రత్యక్షమైనప్పుడు విస్తుపోవటం ప్రయా ణికుల వంతవుతోంది. ‘‘ఎరో డ్‌ స్పెషల్‌’’అన్న రెండు పదాలకు తెలుగులో ‘‘క్షీణించు ప్రత్యేక’’అని కనిపిస్తోంది. ఎరోడ్‌ అన్నది ఊరు పేరు అన్న విషయం కూడా మరిచి, దాన్ని ఆంగ్ల పదంగానే భావిస్తూ తె లుగులోకి తర్జుమా చేసేశారు. ఎరోడ్‌ అన్న పదానికి క్షీణించటం, చెరిగిపోవటం అన్న అర్ధాలుండటంతో తెలుగులో క్షీణించు అన్న పదాన్ని డిస్‌ప్లే బోర్డులో పెట్టేశారు. స్పెషల్‌ అంటే ప్రత్యేక అన్న పదాన్ని జోడించారు. 

తెలుగులోకి బెంగాలీ పదాలు.. 
♦ ఇది స్టేషన్‌లోనికి వెళ్లే ప్లాట్‌ఫామ్‌ నెం.10 వైపు ప్రధాన మార్గం. ఎదురుగా భారీ ఎలక్ట్రానిక్‌ డిస్‌ప్లే బోర్డులు ఏర్పాటు చేసి రైళ్ల వివరాలు ప్రద ర్శిస్తారు. అందులో నాగర్‌సోల్‌–నర్సాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు రావటంలో ఆలస్యం జరుగుతోందని పేర్కొంటూ దాని వేళలను మార్చారు. ఆ విష యం ప్రయాణికులకు తెలిపేందుకు డిస్‌ప్లే బోర్డు లో ఆ వివరాలు ఉంచారు. ఇంగ్లీష్లో ఆ రైలు పేరు ఎదురుగా రీషెడ్యూల్‌ అని రాసి తర్వాత కొత్త సమయాన్ని ఉంచారు.

హిందీలో పరివర్తిత్‌ సమయ్‌ అని పేర్కొన్నారు. కానీ తెలుగులో ఆ ఎక్స్‌ప్రెస్‌ పేరు ఎదురుగా బెంగాలీ భాష పదాన్ని ఉంచారు. తెలుగుకు, బెంగాలీకి తేడా తెలియని సిబ్బంది నిర్వాకమిది. ఇంగ్లీష్, హిందీ తెలియని తెలుగు ప్రయాణికులకు ఈ వ్యవహారం మతిపోగొడుతోంది. అర్ధం కాని తికమక వ్యవహారంతో వారికి రైళ్ల సమాచారం సరిగా చేరటం లేదు. 

ప్రైవేటు సిబ్బంది నిర్వాకం 
రైళ్ల వివరాలను వాయిస్‌ అనౌన్స్‌మెంట్‌ ద్వారా తెలపటం, ఎల్రక్టానిక్‌ డిస్‌ప్లే బోర్డుల ద్వారా తెలిపే పనిని రైల్లే టెండర్ల ద్వారా ప్రైవేటు వ్యక్తులకు అప్పగించింది. ఆ బాధ్యత చూసే సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఈ గందరగోళం నెలకొంది. సాంకేతికంగా ఏదైనా తప్పు జరిగితే వెంటనే గుర్తించాల్సిన రైల్వే అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ తికమక తెలుగు సమస్య ఇప్పటివరకు పరిష్కారమవ్వలేదు.

Videos

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)