ఒడవని జీవో 317 లొల్లి

Published on Sun, 07/07/2024 - 04:28

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్‌) పరిధిలో జీవో 317 అమలుపై తీవ్ర గందరగోళం నెలకొంది. రాష్ట్రంలో అమల్లోకి వచ్చిన నూతన జోనల్‌ విధానానికి అనుగుణంగా ఉద్యోగుల కేటాయింపు చేపట్టేందుకు గత నెలలో ప్రత్యేక కార్యాచరణ రూపొందించినప్పటికీ సాంకేతిక సమస్యలు నెలకొనడంతో అమలు తీరు అయోమయంలో పడింది. 

ఎస్సీ గురుకుల సొసైటీ పరిధిలో 317 కేటగిరీలో దాదాపు నాలుగు వందల మందికి పోస్టింగ్‌ ఇవ్వాల్సి ఉంది. కాంట్రాక్టు పద్ధతిలో నియమితులైన 550 మంది టీచర్ల సర్వీసు క్రమబద్ధీకరించిన అనంతరం వారికి కూడా జోన్ల కేటాయింపు, పోస్టింగ్‌ ఇవ్వాల్సి ఉండగా ఇప్పటివరకు ముందడుగు పడలేదు. 

కనీసం ఉద్యోగుల సీనియార్టీ జాబితాలు సైతం రూపొందించకపోవడంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఉద్యోగుల సాధారణ బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడం గమనార్హం.

సొసైటీ కార్యాలయంలో ఎవరికి వారే...
జీవో 317 కింద ఉద్యోగుల కేటాయింపు, సీని యార్టీ జాబితాలపై ఉద్యోగులంతా ఎస్సీ గురు కుల సొసైటీ కార్యాలయం చుట్టూ తిరుగుతు న్నారు. గత నెల 24, 25 తేదీల్లో వీరికి వెబ్‌ ఆప్షన్లు ఇవ్వాల్సి ఉండగా... సాంకేతిక కారణాలతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. దాదాపు పది రోజులు గడిచినా ఇప్పటివరకు ఈ అంశంలో ఎలాంటి పురోగతి లేదు. దీంతో సొసైటీ కార్యాలయంలో సంబంధిత అధికారులను సంప్రదించినప్పటికీ తమకేమీ తెలియదంటూ చేతులు దులిపేసుకుంటున్నా రని ఉద్యోగులు మండిపడుతున్నారు. 

ప్రస్తు తం ఉద్యోగుల సాధారణ బదిలీల ప్రక్రియ మొదలైంది. ఎస్టీ గురుకుల సొసైటీలో ఉద్యో గుల బదిలీలకు సంబంధించి మార్గదర్శకాలు విడుదలయ్యాయి. ఈనెల 20వ తేదీనాటికి బదిలీల ప్రక్రియ ముగించాలని రాష్ట్ర ప్రభు త్వం స్పష్టం చేసింది. ఇతర గురుకుల సొసైటీ లన్నీ వేగవంతంగా ప్రక్రియ పూర్తిచేస్తుండగా.. ఎస్సీ గురుకుల సొసైటీలో నెలకొన్న విచిత్ర పరిస్థితితో ఉద్యోగులంతా తలపట్టుకుంటున్నా రు. 

ముందుగా జీవో 317 కేటాయింపుల తర్వాత సాధారణ బదిలీలు చేయాలని ఉద్యోగులు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ అంశంపై ప్రభుత్వ పెద్దలకు ఫిర్యాదు చేసేందుకు వారు సిద్ధమవుతున్నట్లు సమాచారం. 

జీవో 317 బాధితులు ఆందోళన చెందొద్దు
జీవో 317 వల్ల నష్టపోయిన ఉద్యోగులు ఏమాత్రం ఆందోళన చెందవద్దని.. వారికి రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా న్యాయం చేస్తుందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హామీ ఇచ్చారు. జీవో 317 బాధిత ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో శనివా రం మంత్రి తన క్యాంపు కార్యాలయంలో సమావేశ మయ్యారు. 

ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నేతలు వివరించిన అంశాలను విన్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ జీవో 317 బాధిత ఉద్యోగులు, స్పౌజ్‌ బదిలీలపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సబ్‌కమిటీ శాశ్వత పరిష్కారం చూపుతుందని స్పష్టం చేశారు. అతి త్వరలో కేబినెట్‌ సబ్‌ కమిటీ ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డికి తుది నివేదిక అందించనుందని వెల్లడించారు. 

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)