Breaking News

22ఏ జాబితాతో తలనొప్పులు!

Published on Thu, 02/19/2026 - 04:32

సాక్షి, హైదరాబాద్‌: ‘అర్బన్‌ ల్యాండ్‌ సీలింగ్‌ (యూఎల్‌సీ) సర్టిఫికెట్లు ఇచ్చిన భూములను కూడా ప్రభుత్వ భూములుగా నోటిఫై చేశారు. ఎల్‌ ఆర్‌ఎస్, భవన నిర్మాణ అనుమతులు ఉండి ఆక్యు పెన్సీ సర్టిఫికెట్లు (ఓసీ) ఉన్న భూములను కూడా మళ్లీ నిషేధిత భూముల జాబితాలో చేర్చారు. పదుల సంఖ్యలో లావాదేవీలు జరిగిన భూము లనూ 22(ఏ) కింద చేర్చారు. గతంలో 22ఏ జాబి తాలో చేర్చడమే అన్యాయమంటూ కోర్టుకెళ్లిన వారి భూములను ఆ జాబితా నుంచి తొలగించాలని ఇప్పటికే న్యాయస్థానాలు ఆదేశించిన భూములను కూడా మళ్లీ అదే జాబితాలో పొందుపరిచారు. 

వెంచర్లు వేసి అమ్మేసిన భూములు భూదాన్‌వంటూ భవిష్యత్తు లావాదేవీలు జరగకుండా నిషేధం విధించారు..’ ఇవీ జిల్లా కలెక్టర్లు రెండు నెలల క్రితం రూపొందించిన నిషేధిత భూముల (22ఏ) జాబితాలోని వ్యవసాయేతర భూముల విషయంలో వస్తున్న ఫిర్యాదులు. కాగా ఈ జాబితా కారణంగా కొత్త తలనొప్పులు ప్రారంభమవుతాయనే ఆందోళన రిజిస్ట్రేషన్‌ శాఖ వర్గాల్లో వ్యక్తమవుతోంది.

ఇంకా కార్డ్‌ సాఫ్ట్‌వేర్‌లోకి రాలేదు
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లు ఇటీవల రూపొందించిన నిషేధిత భూముల జాబితా పూర్తి స్థాయిలో అమల్లోకి రాలేదు. వ్యవసాయ భూముల నిషేధిత జాబితాను ఆన్‌లైన్‌లో నమోదు చేసిన ప్పటికీ వ్యవసాయేతర భూములను మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఆన్‌లైన్‌లో నమోదు చేయలేదు. ఈ జాబితాకు సంబంధించిన ప్రతిపాదనలపై ఫిర్యా దులు వస్తున్న నేపథ్యంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఈ జాబితాలను ఇంకా తమకు సంబంధించిన కార్డ్‌ సాఫ్ట్‌వేర్‌ పరిధిలోకి తీసుకురాలేదు. 

ఈ నేపథ్యంలో ఈ జాబితాను ఆన్‌లైన్‌లో యథావిధంగా పొందుపరిచే విషయంలోనూ సమీక్ష జరపా లని, ఇందులో తప్పులుంటే మొదటికే మోసం వస్తుందనే భావనతో క్షేత్రస్థాయిలో ఇబ్బందులు తలెత్తకుండా మరోమారు ఈ జాబితాలను పరిశీ లించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు సమాచారం. 

ఎక్కువగా అటవీ, తర్వాత భూదాన్‌ భూములు
రెండు నెలల క్రితం జిల్లాల కలెక్టర్లు రూపొందించిన నిషేధిత భూముల జాబితాలో రాష్ట్రం మొత్తం మీద 90 లక్షలకు పైగా ఎకరాల భూమిని చేర్చినట్టు తెలుస్తోంది. ఇందులో ఎక్కువగా అటవీ భూము లున్నట్టు సమాచారం. ఆ తర్వాత రెవెన్యూ, భూదా న్‌ భూములున్నాయని, గతంలో కంటే భూదాన్‌ భూముల విస్తీర్ణం నిషేధిత జాబితాలో పెరిగిందని రెవెన్యూ వర్గాలంటున్నాయి. 

అయితే, ఇంకా భూదాన్‌ భూములు తక్కువగా నమోదు చేశారనే ఆలోచనలో ఉన్నతాధికారులున్నారని, ప్రస్తుత జాబితాలో 75 వేలకు పైగా ఎకరాలను చేర్చగా, కనీసం 2 లక్షల ఎకరాల మేరకు భూదాన్‌ భూము లుంటాయనే అంచనాలో రెవెన్యూ యంత్రాంగం ఉందని తెలుస్తోంది. 

మరోవైపు గతంలో తయారు చేసిన నిషేధిత జాబితాలో భూముల విస్తీర్ణాన్ని సరిగా పేర్కొనలేదని, చాలాచోట్ల సర్వే నంబర్లు మాత్రమే ప్రస్తావించి విస్తీర్ణం నమోదు చేయలేదని రెవెన్యూ వర్గాలంటున్నాయి. అలాచేస్తే ఆ సర్వే నంబర్లలోని భూమి అంతా నిషేధిత జాబితాలోకి వెళ్లేదని, కొత్త జాబితాలో సర్వే నంబర్లతో పాటు భూమి విస్తీర్ణాన్ని పక్కాగా నమోదు చేసిన నేపథ్యంలో ఈ సమస్యకు కొంత మేరకు చెక్‌ పడిందని చెపుతున్నారు.  

Videos

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)