రంగారెడ్డి: నేషనల్‌ పోలీస్‌ అకాడమీలో కంప్యూటర్లు చోరీ

Published on Fri, 01/13/2023 - 12:21

సాక్షి, రంగారెడ్డి: జిల్లాలోని రాజేంద్ర నగర్‌ మండలంలోని హైదరాబాద్‌ సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌  నేషనల్‌ పోలీస్ అకాడమీలో చోరీ జరిగింది. కట్టుదిట్టమైన భద్రత ఉండే ఐపీఎస్‌ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ అకాడమీ నుంచి కంప్యూటర్లు మాయం అయ్యాయి. సిబ్బంది కళ్లు గప్పిన కేటుగాడు.. సుమారు ఏడు కంప్యూటర్లు మాయం చేసినట్టు తెలుస్తోంది. అయితే.. 

ఇది ఎట్టకేలకు అది ఇంటి దొంగ పనే అని తేల్చారు అధికారులు.  కంప్యూటర్లు మాయం అయిన విషయాన్ని గమనించిన అధికారులు.. సీసీటీవీ ఫుటేజీలు పరిశీలించారు. ఆ ఫుటేజీల్లో చోరీ దృశ్యాలు రికార్డు అయ్యాయి. దొంగను ఐటీ సెక్షన్ లో పని చేస్తున్న చంద్రశేఖర్ గా గుర్తించారు.

ఈ మేరకు ఎన్‌పీఏ అధికారులు రాజేంద్ర నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోలీస్‌ అకాడమీలో చోరీ జరగడం, అది బయటకు రావడంతో ఉన్నతాధికారులు ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది. 

Videos

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)