Breaking News

సమగ్ర సర్వే షురూ

Published on Thu, 11/07/2024 - 04:41

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే (సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే) ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభమైంది. తొలిరోజు ఇళ్లకు స్టిక్కర్లు వేసే కార్యక్రమాన్ని రాష్ట్రమంతటా నిర్వహించారు. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లిలో మంత్రి శ్రీధర్‌బాబు స్టిక్కర్లు వేసే కార్యక్రమంలో పాల్గొన్నారు. పలు జిల్లాల్లో కలెక్టర్లు సర్వే పనుల్లో పాల్గొన్నారు. గురు, శుక్రవారాల్లో కూడా స్టిక్కర్లు వేసే కార్యక్రమం కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు. 

మొదటి దశలో భాగంగా ఈ నెల 8వ తేదీ వరకు ప్రతి ఎన్యూమరేషన్‌ బ్లాక్‌లో ఉన్న ప్రతి ఇంట్లో ఉన్న కుటుంబాలను నమోదు చేసి, వారి ఇంటి నంబరు, కుటుంబ యజమాని పేరుతో కూడిన జాబితాను తయారు చేయనున్నారు. ఈ జాబితా పూర్తయిన ఇళ్లకు స్టిక్కర్లు వేయనున్నారు. ఆ తర్వాత రెండోదశలో ఈ నెల 9 నుంచి సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే చేపట్టనున్నారు. ఈ సర్వేలో లభించిన సమాచారాన్ని మండల, జిల్లా స్థాయిలో కంప్యూటరీకరిస్తారు. జిల్లా, రాష్ట్ర స్థాయిలో డ్యాష్‌బోర్డు ఏర్పాటు చేసి సర్వే వాస్తవ పురోగతిని నిరంతరం పర్యవేక్షించనున్నారు. 

ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 87,092 ఎన్యూమరేషన్‌ బ్లాక్‌లను గుర్తించగా, జీహెచ్‌ఎంసీలో 19,328, ఇతర ప్రాంతాల్లో 67,764 ఉన్నాయి. ఈ బ్లాక్‌ల వారీగా సర్వే చేసేందుకు 94,750 మంది ఎన్యూమరేటర్లను ఎంపిక చేశారు. 24,488 మందిని జీహెచ్‌ఎంసీలో నియమించగా, ఇతర ప్రాంతాల్లో 70,262 మందిని నియమించారు. వీరి సహకారంతో రాష్ట్రంలోని 1,17,44,954 కుటుంబాలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని సేకరించనున్నారు.    

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)