Breaking News

ఒక పోస్టు..174 మంది పోటీ

Published on Mon, 04/24/2023 - 04:48

సాక్షి, హైదరాబాద్‌: ఖాకీ కొలువులకు యువతలో ఎంతో క్రేజ్‌ ఉంటుంది. అవకాశం, అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ పోలీస్‌ ఉద్యోగానికి పోటీ పడుతుంటారు. ఈసారి కూడా కానిస్టేబుల్‌ పోస్టులకు విపరీతమైన పోటీ ఉంది. ఈ నెల నిర్వహించనున్న కానిస్టేబుల్‌ పోస్టుల తుది రాత పరీక్షకు పార్ట్‌–2 దరఖాస్తు పూర్తి చేసిన అభ్యర్థుల సంఖ్య చూస్తే కానిస్టేబుల్‌ పోస్టులకు కాంపిటీషన్‌ ఫుల్‌ అన్న విషయం స్పష్టం అవుతోంది.

సివిల్‌ పోలీస్, టీఎస్‌ఎస్పీ, ఆర్మ్‌డ్‌ రిజర్వ్, ఎస్పీఎఫ్, ఫైర్, జైళ్లశాఖ, రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్, ఎక్సైజ్‌ శాఖల్లో కానిస్టేబుల్‌ పోస్టులకు ఈనెల తుది రాత పరీక్ష నిర్వహించబోతున్నారు. ఉమ్మడి పది జిల్లా కేంద్రాలతోపాటు హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో పోలీస్‌ నియామక మండలి పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసింది. సోమవారం నుంచి అభ్యర్థులకు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు సమయం ఇచ్చింది. ప్రతి అభ్యర్థి  www.tslprb.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి తమ లాగిన్‌ ఐడీ ద్వారా హాల్‌టికెట్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.  

ఎక్సైజ్‌ కానిస్టేబుల్స్‌కు పోటీ తీవ్రం..  
ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ పోస్టులకు పోటీ తీవ్రంగా ఉంది. మొత్తం 614 పోస్టులకుగాను 1,06,­272 మంది తుది రాతపరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. అంటే ఒక్కో పోస్టుకు 174 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అదేవిధంగా పోలీస్‌ శాఖలోని వివిధ విభాగాల్లో సివిల్‌ కానిస్టేబుల్, ఇతర పోస్టులకు కలిపి మొత్తం 3,40,639 మంది తుది రాత పరీక్షకు దరఖాస్తు చేసుకున్నట్టు పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు అధికారులు తెలిపారు.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)