Breaking News

గరిష్టంగా రూ.1.27 కోట్లు.. కనిష్టంగా రూ.16 లక్షలు

Published on Sun, 04/19/2026 - 05:30

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: రీజినల్‌ రింగ్‌ రోడ్డు (ట్రిపుల్‌ ఆర్‌) నిర్మాణంతో భూములు కోల్పోతున్న నిర్వాసితులకు పరిహారం పంపిణీ జోరందుకుంది. ఎకరానికి గరిష్టంగా రూ.1.27 కోట్ల చొప్పున చెల్లిస్తున్నారు. 65 నంబరు జాతీయ రహదారి (ముంబై హైవే)ని ఆనుకొని ఉన్న భూములకు ఈ ధర చెల్లిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం పెద్దాపూర్‌ గ్రామం పరిధిలోని భూములకు ఈ ధర పలికింది. 

ఇదే గ్రామంలో హైవేకు కాస్త దూరంలో ఉన్న భూములకు ఎకరానికి రూ.1.01 కోట్లుగా ధర నిర్ణయించారు. తక్కువలో తక్కువగా హత్నూర మండలం దౌల్తాబాద్‌ గ్రామ శివారులోని భూములకు ఎకరానికి కేవలం రూ.16 లక్షలతోనే సరిపెడుతున్నారు. తమ విలువైన భూములకు ఇంత తక్కువ పరిహారం చెల్లిస్తున్నారని నిర్వాసిత రైతులు పెదవి విరుస్తున్నారు. 

రూ.119 కోట్ల పరిహారం చెల్లింపులు 
ట్రిపుల్‌ ఆర్‌ కోసం సంగారెడ్డి కాల (కాంపిటేటివ్‌ అథారిటీ ల్యాండ్‌ అక్విజేషన్‌) పరిధిలో 526 ఎకరాల భూమి అవసరం ఉంటుందని నేషనల్‌ హైవే అథారిటీ నిర్ణయించింది. భూసేకరణలో భాగంగా 23 గ్రామాలకు సంబంధించిన 427 ఎకరాల భూసేకరణ అవార్డులు నేషనల్‌ హైవే అథారిటీ ప్రాజెక్టు డైరెక్టర్‌ నుంచి అప్రూవల్‌ అయ్యాయి. ఈ భూములు స్వాధీనం చేసుకున్న రైతుల ఖాతాల్లో ఇప్పటి వరకు రూ.119.50 కోట్లు జమ చేశారు. 

అయితే ట్రిపుల్‌ ఆర్‌ నిర్మాణంతో కోల్పోతున్న భూములకు ప్రభుత్వం చెల్లిస్తున్న పరిహారం పట్ల నిర్వాసిత రైతులు అసంతృప్తితో ఉన్నారు. దీంతో రెవెన్యూ అధికారులు రైతులతో ఆర్బిట్రేషన్‌ (మధ్యవర్తిత్వం) మీటింగ్‌లు నిర్వహిస్తున్నారు. అధికారులు రిజిస్ట్రేషన్‌ విలువ (ఇటీవల కాలంలో జరిగిన లావాదేవీలు) ఆధారంగా పరిహారం లెక్కిస్తున్నారు.

వీలైనంత ఎక్కువ మొత్తంలో పరిహారం
నిర్వాసిత రైతులకు వీలైనంత ఎక్కువ పరిహారం అందేలా చూస్తున్నాం. ఇప్పటికే రిజిస్ట్రేషన్‌ విలువపై సుమారు 250 శాతం వరకు ధరను పెంచి పరిహారం ఇస్తున్నాం. తమకు ఇచ్చే పరిహారాన్ని పెంచాలని కోరుతూ కొందరు రైతులు కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. ఆర్బిట్రేషన్‌ మీటింగ్‌లు నిర్వహిస్తున్నాం. ఐదు నుంచి పది శాతం పరిహారం పెరిగే అవకాశాలు ఉన్నాయి. – గున్నాల రాజేందర్, సంగారెడ్డి ఆర్డీఓ 

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)