Breaking News

జేపీఎస్‌ల పనితీరు మదింపునకు కమిటీలు

Published on Sun, 07/16/2023 - 01:55

సాక్షి, హైదరాబాద్‌: జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల (జేపీఎస్‌) సర్విస్‌ రెగ్యులరైజేషన్‌ కసరత్తులో భాగంగా వారి పనితీరు మదింపునకు జిల్లా స్థాయి పనితీరు మూల్యాంకన కమిటీ (డిస్ట్రిక్ట్ లెవల్‌ పెర్‌ఫార్మన్స్‌ ఎవాల్యూయేషన్‌ కమిటీ)లను రాష్ట్ర ప్రభు త్వం ఏర్పాటు చేసింది. అదనపు కలెక్టర్‌ (స్థానిక సంస్థలు), ఎస్పీ లేదా ఎస్పీ నామినీగా డీఎస్పీ కంటే తక్కువ ర్యాంక్‌ కాని అధికారి, జిల్లా అటవీ అధికారులతో ఈ కమిటీని ఏర్పాటు చేశారు.

వివిధ నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా ఈ కమిటీ జేపీఎస్‌ల పనితీరును మదింపు చేస్తుంది. ఈ మేర కు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా శనివారం ఆదేశాలు జారీ చేశారు. నాలుగేళ్ల సర్విస్‌ పూర్తి చేసుకున్న జేపీఎస్‌లను రెగ్యులరైజ్‌ చేసే క్రమంలో ఈ కమిటీలు ఏర్పాటయ్యాయి. ఈ మేరకు పలు మార్గదర్శకాలను ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 

మొత్తం 100 పాయింట్లతో మదింపు 
♦ జిల్లా కమిటీకి అదనపు కలెక్టర్‌ (స్థానిక సంస్థలు) నోడల్‌ ఆఫీసర్‌గా వ్యవహరిస్తారు. 
♦  కమిటీ గ్రామ పంచాయతీలను సందర్శించి, ప్రభుత్వం నిర్దేశించిన పారామీటర్ల ఆధారంగా 4 ఏళ్ల సర్వీసు పూర్తిచేసిన జేపీఎస్‌ల పనితీరు అంచనా వేసి జిల్లా కలెక్టర్‌కు నివేదిక సమర్పిస్తుంది. 
♦ ఈ డేటాను, మదింపునకు సంబంధించిన స్కాన్డ్‌ కాపీలను పంచాయతీరాజ్‌ కమిషనర్‌ (పీఆర్‌) ఓ మొబైల్‌ యాప్‌లో నమోదు చేస్తారు. 
♦ జిల్లా కలెక్టర్లు ఎప్పటికప్పుడు కమిటీలిచ్చే నివేదికలను పరిశీలించి జేపీఎస్‌ల సర్విసు రెగ్యులరైజైన్‌ ప్రతిపాదనలను పీఆర్‌ కమిషనర్‌కు సమర్పిస్తారు. 
♦  ఈ నివేదికలపై పీఆర్, గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్‌ తదనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటారు. 
♦ రోడ్లు, మురుగు కాల్వల శుభ్రత, దోమల నివారణ, వైకుంఠధామాల నిర్వహణ, నర్సరీల నిర్వహణ, మొక్కల పెంపకం, ప్రకృతి వనాలు, ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరణ..తదితర అంశాలకు వేర్వేరుగా పాయింట్లు ఇవ్వడం ద్వారా, మొత్తం వంద పాయింట్లుగా మదింపు చేస్తారు. 

Videos

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)