Breaking News

దివ్యాంగులకు ఉచిత భోజనం

Published on Tue, 03/04/2025 - 12:06

సాక్షిప్రతినిధి, ఖమ్మం: కలెక్టరేట్‌కు వచ్చే దివ్యాంగుల సమస్యలను తెలుసుకుని, పరిష్క­రించడమే కాక వారి ఆకలి తీర్చేలా ఖమ్మం కలెక్టర్‌ ముజమ్మిల్‌ఖాన్‌ వినూత్న నిర్ణయం తీసు­­కు­­న్నారు. పాలనలో తనకంటూ ప్రత్యేక­తను చూపుతున్న ఆయన.. ప్రజా సమస్యల పరిష్కారంలో వినూత్న పంథా అనుసరిస్తు­న్నారు. ప్రతీ సోమవారం జరిగే ప్రజావాణి­తోపాటు వివిధ పనుల కోసం జిల్లా నలు­మూ­లల నుంచి దివ్యాంగులు కలెక్టరేట్‌కు వస్తుంటారు. అయితే వీరు ఆకలితో వెళ్లొద్దనే భావ­నతో కలెక్టరేట్‌ క్యాంటీన్‌లో ఉచితంగా మధ్యా­హ్న భోజన సౌకర్యం కల్పించాలని కలెక్టర్‌ నిర్ణయించారు. ఈ పథకం ఈ నెల 5వ తేదీ నుంచి అమల్లోకి రానుంది.

కడుపు నిండా తినేలా..: ఉచిత భోజనం అంటే అన్నం, ఒక కూర కాకుండా.. పూర్తి మెనూతో అమలయ్యేలా కలెక్టర్‌ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. అన్నం, ఆకుకూర పప్పు, రోటిపచ్చడి, రెండు కూరలు, సాంబార్‌ లేదా రసం, పెరుగుతో దివ్యాంగులకు భోజనాన్ని సమకూరుస్తారు. కలెక్టరేట్‌లోని కార్యాలయా­లకు ఇందుకోసం కూపన్లు ఇస్తారు. ఆయా శాఖలకు 40% వైకల్యంతో ఉన్న దివ్యాంగులు వస్తే కూపన్లు అందజేయనున్నారు. ప్రతీరోజు జారీ చేసిన కూపన్ల వివరాలను రిజిస్టర్‌లో నమోదు చేసి, ఒక్కో భోజనానికి రూ. 80 చొప్పున క్యాంటీన్‌ నిర్వాహకులకు నెలకోమారు చెల్లిస్తారు. ది­వ్యాంగులకు ఉచిత భోజన సదుపాయం కల్పిస్తున్నామనే విషయాన్ని కలెక్టరేట్‌లోని ప్రవేశ మార్గాల్లో బోర్డులు ఏర్పాటు చేయించనున్నారు.

‘సదరం’నంబర్‌ ఆధారంగా..
దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్‌ నంబర్‌ ఆధా­రంగా కూ­ప­న్‌ జారీ చేస్తారు. ఈ కూపన్‌తో కలెక్టరేట్‌ క్యాంటీన్‌లో ఉచితంగా భోజనం చేయొ­చ్చు. ఇందుకోసం క్యాంటీన్‌ బాధ్యు­లకు రూ.80 చొప్పున చెల్లిస్తాం. దివ్యాంగుల నుంచి వచ్చిన విజ్ఞప్తితో ఈ నిర్ణయం తీసుకున్నాం. బుధవారం నుంచి ఉచిత భోజన కార్యక్రమం ప్రారంభమవుతుంది. – ముజమ్మిల్‌ఖాన్, కలెక్టర్, ఖమ్మం

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)