Breaking News

అంగరంగ వైభవంగా మానస వివాహం (ఫొటోలు)

Published on Thu, 05/22/2025 - 13:27

పెద్దపల్లి రూరల్‌: కలెక్టరే పెళ్లి పెద్ద అయ్యారు. అధికారులే అయినవాళ్లయ్యారు. తమ ఇంటి ఆడపడుచులా అక్కున చేర్చుకున్నారు. అంగరంగ వైభవంగా వివాహం జరిపించారు. రామగుండం ప్రాంతానికి చెందిన తబితా ఆశ్రమంలో ఉంటున్న నక్క మానస వివాహం.. రాజేశ్‌తో కలెక్టరేట్‌లోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో బుధవారం అత్యంత వైభవంగా జరిగింది. 

తల్లిదండ్రులను చిన్నతనంలోనే కోల్పోయిన నక్క మానస, నక్క లక్ష్మి అక్కాచెల్లెళ్లు. వీరు 16 ఏళ్లుగా తబితా ఆశ్రమంలో ఉంటున్నారు. మానసకు వివాహం నిశ్చయం కావడంతో వివాహతంతు జరిపించేందుకు కలెక్టర్‌ కోయ శ్రీహర్ష చొరవ తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే కలెక్టరేట్‌ ఆవరణలోని శ్రీవేంకటేశ్వర ఆలయాన్ని వివాహవేదిక చేశారు. అర్చకుల మంత్రోచ్ఛారణలు, బాజాభజంత్రీల మధ్య ఉదయం 11.05 గంటలకు వివాహం ఘనంగా జరిగింది. 

కలెక్టర్‌ కోయ శ్రీహర్ష, ఎమ్మెల్యే విజయరమణారావు, పెద్దపల్లి డీసీపీ కరుణాకర్, అడిషనల్‌ కలెక్టర్‌ వేణు, టీఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు బొంకూరి శంకర్‌ సహా పలుశాఖల జిల్లా అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీఎన్జీవోల సంఘం ఆధ్వర్యంలో సేకరించిన రూ.61,800 విలువైన చెక్కును కలెక్టర్‌ శ్రీహర్ష వధూవరులకు అందించారు. వరుడి బం««ధుమిత్రులతో పాటు మోచి సంఘం జిల్లా అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్, కార్యదర్శి రాజు, ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ కార్యదర్శి శ్రీనివాస్‌ తదితరులు.. మోచికుల ఆ«రాధ్య దైవమైన సంత్‌ రవిదాస్‌ హరలయ్య జ్ఞాపికను వధూవరులకు అందజేశారు.   







 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)