Breaking News

కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌ నేతృత్వంలో మరో విజయం

Published on Tue, 06/23/2026 - 11:57

సిరిసిల్ల/తంగళ్లపల్లి(సిరిసిల్ల): విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం పెట్టాలని కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌ ఆదేశించారు. తంగళ్లపల్లి మండల కేంద్రంలోని తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్‌ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్‌ సోమవారం తనిఖీ చేశారు. పాఠశాలలోని వసతులు, ఆహార నాణ్యత పరిశీలించారు. కలెక్టర్‌ డైనింగ్‌హాల్‌లోకి వెళ్లగా విద్యార్థినులు భోజనం చేస్తుండడంతో వారి వద్దకు మెనూ గురించి ఆరా తీశారు. బియ్యం, పప్పులు, ఇతర నిత్యావసర సరుకుల నాణ్యతను పరిశీలించారు. హాస్టల్, విద్యాలయ ఆవరణ ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలన్నారు.

జనగణనలో జిల్లాకు మొదటి స్థానం
జిల్లా జనగణన –2027 మొదటి దశలో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. జిల్లాలో విజయవంతంగా నిర్వహించిన కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌ను జిల్లా అధికారుల ప్రతినిధులు సోమవారం కలిసి శుభాకాంక్షలు తెలిపారు. జనగణన తొలి దశగృహ జాబితా, గృహాల లెక్కింపు 2026 మే 11న ప్రారంభమై జూన్‌ 9తో ముగిసింది. రాష్ట్రస్థాయిలో కచ్చితత్వ వివరాల నమోదు, ప్రక్రియను పూర్తి చేయడంతో జిల్లా అగ్రస్థానంలో నిలిచింది.  డిస్ట్రిక్ట్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ రాజన్న సిరిసిల్ల(డోర్స్‌) అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి అఫ్జల్‌ బేగం, సీపీవో శ్రీనివాసాచారి తదితరులు కలెక్టర్‌ను కలిశారు. 

కలెక్టర్‌ను కలిసిన జిల్లా వైద్యాధికారి అంజలా ఆల్ఫ్రెడ్‌
జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి అంజలా ఆల్ఫ్రెడ్‌ కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌ను కలిశారు. జిల్లా వైద్యాధికారిగా పూర్తి స్థాయి బాధ్యతలు తీసుకున్న సందర్భంగా మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్క అందించారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)