Breaking News

తెలుగు రాష్ట్రాల్లో చలి పులి పంజా

Published on Mon, 12/08/2025 - 10:06

హైదరాబాద్‌: దేశ వ్యాప్తంగా చలి గాలుల తీవ్రత పెరుగుతోంది. పలు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు అంతకంతకూ పడిపోయి సింగిల్‌ డిజిట్‌కి రావడానికి సిద్ధంగా ఉన్నాయి. రాజస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో ప్రస్తుతం ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల కంటే తక్కువగా నమోదు అవుతున్నాయి. ఇదే పరిస్థితి ఉత్తరాది రాష్ట్రాల్లో కొనసాగుతోంది. 

ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా చలి పులి పంజా విసురుతుంది.  ఉత్తరాది నుంచి చలిగాలుల తీవ్రత పెరుగుతుంది. ఉత్తర తెలంగాణకు కోల్డ్‌ వేవ్‌ ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి.  రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని,, చలి బారి నుంఇ కాపాడుకునే అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ప్రజలకు సూచిస్తున్నారు.  హైదరాబాద్‌లో చలి మరింత పెరిగే అవకాశం ఉంది. 

ఇక ఏపీలో కూడా దాదాపు ఇదే పరిస్థితి ఉంది. సముద్ర తీర ప్రాంతాలు, గోదావరికి అత్యంత సమీపంలో  ఉండే గ్రామాల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే పర్యాటక ప్రదేశాలైన లంబసింగి, పాడేరు, అరకుల్లో చలి తీవ్రత బాగా పెరిగిపోయింది. చలి తీవ్రతకు  ప్రజలు గజగజ వణికిపోతున్నారు. ఉదయం, రాత్రి సమయాల్లో ఉష్ణోగ్రతలు  పడిపోతున్నాయి. 

చలి తీవ్రత నుంచి శరీరాన్ని కాపాడుకునే కొన్ని మార్గాలు..

శీతాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
వెచ్చని బట్టలు ధరించండి స్వెటర్లు, జాకెట్లు, గ్లౌవ్స్, స్కార్ఫ్‌లు, సాక్స్‌లు తప్పనిసరిగా ధరించాలి. 

పోషకాహారం తీసుకోవాలి
ప్రోటీన్, విటమిన్ C, విటమిన్ D, ఐరన్, జింక్ ఉన్న ఆహారం తీసుకోవాలి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

తగినంత నీరు తాగండి.. చలికాలంలో దాహం తక్కువగా ఉన్నా, నీరు తాగకపోతే డీహైడ్రేషన్, చర్మం పొడిబారడం జరుగుతుంది.

మాయిశ్చరైజర్ వాడాలి. పొడిబారడం, చర్మం చిట్లిపోవడం నివారించవచ్చు.

వ్యాయామం చేయండి.. చలికాలంలో శరీరాన్ని చురుకుగా ఉంచడం చాలా ముఖ్యం. ఇంట్లోనే యోగా, స్ట్రెచింగ్, లైట్ వర్కౌట్స్ చేయవచ్చు.

హైజీన్ పాటించండి.. చేతులు తరచుగా కడగాలి. ఫ్లూ, జలుబు, దగ్గు వంటి వ్యాధులు చలికాలంలో ఎక్కువగా వ్యాపిస్తాయి.

Videos

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

ముళ్ల కంచెలతో దిగ్బంధం.. పోలీస్ Vs వైఎస్ఆర్ సీపీ

ఏపీలో రాష్ట్రపతి పాలన?

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)