Breaking News

గుడ్‌న్యూస్‌! ఒక్కో బొగ్గు గని కార్మికుడికి లక్షన్నర నుంచి రూ.5 లక్షలు..

Published on Sun, 05/21/2023 - 03:24

గోదావరి ఖని: దేశవ్యాప్త బొగ్గు గని కార్మికుల 11వ వేతన ఒప్పందం ఎట్టకేలకు శనివారం ఖరారైంది. 23నెలల ఆలస్యంగా జరిగిన లిఖితపూర్వక వేతన ఒప్పందంపై కోలిండియా యాజమాన్యం, జాతీయ కార్మిక సంఘాల నాయకులు సంతకాలు చేశారు. కోల్‌కత్తాలో రెండు రోజుల పాటు జరిగిన 11వ వేజ్‌బోర్డు 10వ సమావేశంలో కనీస వేతనాలపై 19శాతం పెరుగుదల, అలవెన్స్‌లపై 25శాతం పెరుగుదలతో ఒప్పందం పూర్తయ్యింది.

పెరిగిన వేతనాలు జూన్‌ నుంచి అమల్లోకి రానుండగా, జూలై నుంచి కార్మికులు అందుకోనున్నారు. పెరిగిన 19శాతం కనీస వేతనం బకాయిల మేరకు ఒక్కో కారి్మకునికి రూ.1.50లక్షల నుంచి రూ.5లక్షల వరకు ఎరియర్స్‌ రూపంలో 23నెలల బకాయిలు అందనున్నాయి. ద్విచక్రవాహనాలకు పెట్రోల్‌ అలవెన్స్‌ చెల్లిస్తున్నట్టుగానే, ఈసారి కార్లకు కూడా చెల్లించేందుకు అంగీకరించింది. ట్రాన్స్‌పోర్టు, అడిషనల్‌ ట్రాన్స్‌పోర్టు, వాషింగ్‌ అలవెన్స్‌తో పాటు పలు అలవెన్స్‌లపై 25శాతం పెరిగింది.

ఈ ఒప్పందంతో దేశవ్యాప్తంగా 4లక్షల మందికి ప్రయోజనం చేకూరనుండగా, వీరిలో సింగరేణి కారి్మకులు 39వేల మంది ఉన్నారు. సమావేశంలో కోలిండియా చైర్మెన్‌ ప్రమోద్‌ అగర్వాల్‌తో పాటు సింగరేణి డైరెక్టర్‌(పా) బలరాం, పర్సనల్‌ జీఎం కుమార్‌రెడ్డి, జేబీసీసీఐ వేజ్‌బోర్డు సభ్యులు వాసిరెడ్డి సీతారామయ్య (ఏఐటీయూసీ), జనక్‌ప్రసాద్‌(ఐఎన్‌టీయూసీ), రియాజ్‌ అహ్మద్‌(హెచ్‌ఎంఎస్‌), మంద నర్సింహారావు(సీఐటీయూ), మాధవనాయక్‌(బీఎంఎస్‌) పాల్గొన్నారు.  

Videos

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు