నేడు వరంగల్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌

Published on Sat, 06/29/2024 - 05:48

సాక్షి ప్రతినిధి, వరంగల్‌: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శనివారం వరంగల్‌లో పర్యటించనున్నారు. వాస్తవానికి శుక్రవారం సీఎం పర్యటన ఖరారు అయినప్పటికీ ఢిల్లీ కార్యక్రమాలలో బిజీగా ఉన్నందున శనివారానికి వాయిదా పడింది. గ్రేటర్‌ వరంగల్‌ సమగ్ర అభివృద్ధితో పాటు పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలపై సమీక్షించేందుకు ఆయన శనివా రం గ్రేటర్‌ వరంగల్‌లో పర్యటించనున్నారు. ఈ మే రకు సీఎంవో వర్గాలు శుక్రవారం సాయంత్రం ము ఖ్యమంత్రి పర్యటన వివరాల్ని విడుదల చేశాయి.  

ఇదీ షెడ్యూల్‌...
ఢిల్లీ నుంచి శనివారం ఉదయం హైదరాబాద్‌ చేరుకోనున్న ఆయన శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌ ద్వారా మధ్యాహ్నం 1.30 గంటలకు కాకతీయ టెక్స్‌టైల్‌ పార్క్‌కు చేరుకుంటారు. 1.30 నుంచి 1.50 గంటల వరకు టెక్స్‌టైల్‌ పార్క్‌ సందర్శిస్తారు. అక్కడి నుంచి రంగంపేట వద్ద నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ మల్టీ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి ని సందర్శిస్తారు. 2.10 నుంచి 2.30 గంటల వరకు ఆస్పత్రి సందర్శన అనంతరం హనుమకొండ జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయానికి చేరుకుంటారు.

2.45 నుంచి 3.00 గంటల మధ్య మహిళా శక్తి క్యాంటీన్‌ ప్రారంభిస్తారు. తర్వాత గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ అభివృద్ధి కార్యకలాపాలు, సమస్యలపై ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. 5.40 నుంచి 6.10 వరకు హంటర్‌ రోడ్డులోని మెడికోవర్‌ ఆస్పత్రిని ప్రారంభించి 6.10 గంటలకు బయల్దేరి 6.30 గంటలకు హనుమకొండ ఆర్ట్స్‌ కాలేజీ గ్రౌండ్‌కు చేరుకుంటారు. అనంతరం హెలికాప్టర్లో 7.20 గంటలకు బేగంపేట్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)