Breaking News

7న పాతబస్తీలో మెట్రోరైలు పనులకు సీఎం శంకుస్థాపన

Published on Sun, 03/03/2024 - 04:00

సాక్షి, హైదరాబాద్‌: పాతబస్తీలో మెట్రో రైలు పను లకు ఈ నెల 7న ఫలక్‌నుమాలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారని ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ వెల్లడించారు. దేశంలో ముస్లింలతో పాటు దళిత సామాజిక వర్గాలను టార్గెట్‌ చేసి నల్లచ ట్టాలను ప్రయోగించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. ఏఐఎంఐఎం కేంద్ర కార్యాలయమైన హైదరాబాద్‌ దారుస్సలాం మైదా నంలో శనివారం జరిగిన పార్టీ 66వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. ఇప్పటికే ముస్లిం, దళితులపై ఉక్కుపాదం మోపుతుందని, సీఏఏ చట్టం ఏన్పీఆర్, ఎన్‌ఆర్‌సీలో ఇమిడి ఉందని పేర్కొ న్నారు.

మరోమారు బీజేపీ గద్దెనెక్కకుండా అడ్డుకో వాల్సిన అవసరం ఉందన్నారు. బీజేపీ పదేళ్ల పాల నలో నిరుద్యోగం పెరిగి పోయిందని. హిందూత్వ ఎజెండా తప్ప అభివృద్ధి లేదన్నారు. దేశంలో మత చిచ్చుతో రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్ని స్తోదని దుయ్యబట్టారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో హైదరాబాద్‌లో బీజేపీ పాగావేయాలన్నది ఆ పార్టీ పగటి కలేనని ఒవైసీ ఎద్దేవా చేశారు. బీజేపీకి దమ్ముంటే ఇక్కడి నుంచి పోటీ చేయాలని మోదీకి సవాల్‌ విసిరారు. సభలో పార్టీ జాతీయ కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే సయ్యద్‌ అహ్మద్‌ పాషా ఖాద్రీతోపాటు పార్టీ శాసనసభ్యులు,ఎమ్మెల్సీలు తదితరులు పాల్గొన్నారు.


పార్టీ ఆవిర్భావ సభలో మాట్లాడుతున్న అసదుద్దీన్‌

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)