Breaking News

వేదవల్లి కుటుంబాన్ని ఆదుకున్న సీఎం రేవంత్‌

Published on Fri, 05/16/2025 - 12:39

సాక్షి, హైదరాబాద్‌: తీవ్ర అనారోగ్యం బారిన పడిన కూతురును కాపాడుకునేందుకు ఆ తల్లి దండ్రులు చివరి క్షణంవరకు పోరాడారు. ఆస్తు లన్నీ అమ్మి, అప్పులు చేసి కూడా రెండేళ్లపాటు వైద్యం చేయించారు. అయినా, పాప ప్రాణాలు దక్కలేదు. మరోవైపు స్తోమతకు మించి వైద్యా నికి ఖర్చు చేయటంతో ఆ కుటుంబం ఆర్థికంగా చితికిపోయింది. ఆ విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆపన్నహస్తం అందించారు. 

ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్‌) నుంచి గతంలో పాప వైద్యానికి రూ.8 లక్షలు ఇవ్వటంతోపాటు.. ఇప్పుడు ఆ పాప కుటుంబాన్ని ఆదుకునేందుకు మరో రూ.7 లక్షలు మంజూరు చేశారు. హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌కు చెందిన రఘు, మంజుల దంపతుల పెద్ద కుమార్తె వేదవల్లి (5)కి 2022లో బ్లడ్‌ క్యాన్సర్‌ సోకింది. పాపను రక్షించుకునేందుకు రెండేళ్లపాటు తల్లిదండ్రులు ఆసుపత్రుల చుట్టూ తిప్పారు. 2024లో సీఎం ఎ.రేవంత్‌రెడ్డి దృష్టికి ఈ విషయం రావటంతో చికిత్సకు అవసరమైన రూ.8 లక్షలు మంజూరు చేశారు. 

చికిత్స అందించినప్పటికీ గతేడాది చివరలో వేదవల్లి మరణించింది. ఆమె చికిత్సకు ఆ కుటుంబం పెద్ద మొత్తంలో ఖర్చు చేయటంతో కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకునేందుకు రూ.7 లక్షలు మంజూరు చేయాలని సీఎం అధికారుల ను ఆదేశించారు. ఆ మేరకు రూ.7 లక్షల చెక్కు ను సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు గురువా రం వేదవల్లి తండ్రి రఘుకు అందజేశారు.  
 

Videos

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)