Breaking News

హైస్పీడ్ రైళ్ల మార్గాల ప‌నులు వేగ‌వంతం చేయండి.. సీఎం రేవంత్

Published on Fri, 10/30/2026 - 23:30

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణకు ప్ర‌క‌టించిన‌ హైస్పీడ్ రైళ్ల ప‌నులు వేగ‌వంతం చేయాల‌ని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణ‌వ్‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. ఈ రోజు (శుక్రవారం) ఢిల్లీలో కేంద్రమంత్రితో సీఎం భేటీ అయ్యారు.హైదరాబాద్ - పుణె, హైదరాబాద్ - బెంగళూరు, హైదరాబాద్ - చెన్నై కారిడార్లకు సంబంధించి, కేంద్ర ప్ర‌భుత్వం పంపిన ప్ర‌తిపాద‌న‌ల‌పై రాష్ట్ర ప్ర‌భుత్వం స‌మీక్షించి, కొన్ని మార్పుల‌ను సూచిస్తూ కేంద్ర ప్ర‌భుత్వానికి ప్ర‌తిపాద‌న‌లు పంపింద‌ని సీఎం తెలిపారు. ఈ మూడు కారిడార్ల‌కు సంబంధించి రాష్ట్ర ప్ర‌భుత్వం ఎటువంటి భూ సేక‌ర‌ణ ప్ర‌క్రియ‌ను ప్రారంభించ‌లేద‌ని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణ‌వ్‌కు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

కేంద్ర ప్ర‌భుత్వం అలైన్‌మెంట్ ఆమోదించిన త‌ర్వాత భూ సేక‌ర‌ణ‌ను ప్రారంభిస్తామ‌ని సీఎం స్ప‌ష్టం చేశారు. సాధ్య‌మైనంత త్వ‌ర‌గా అలైన్‌మెంట్ ప్ర‌క్రియ‌ను పూర్తి చేయాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు.  తెలంగాణ అభివృద్ధికి అవ‌స‌ర‌మైన కీల‌క రైలు ప్రాజెక్టుల‌పై కేంద్ర మంత్రితో సీఎం చ‌ర్చించారు. వికారాబాద్ – కృష్ణా కొత్త రైలు మార్గాన్ని (130 కి.మీ.) వెంట‌నే మంజూరు చేయాల‌ని సీఎం కోరారు. వికారాబాద్ జిల్లా టేకల్‌కోడ్ పరిసరాల్లో భారీ సున్నపురాయి నిక్షేపాలు బయటపడ్డాయని, దీంతో ఈ ప్రాంతాన్ని సిమెంట్, టెక్స్‌టైల్ హబ్‌గా మార్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందని కేంద్ర మంత్రికి తెలియ‌జేశారు.

హైదరాబాద్ చుట్టూ సుమారు 360 కి.మీ మేర నిర్మిస్తున్న రీజినల్ రింగ్ రోడ్డు (RRR) ప‌క్క‌నే రీజినల్ రింగ్ రైలును అలైన్‌మెంట్ చేయాల‌ని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణ‌వ్‌ను సీఎం కోరారు. రీజిన‌ల్ రింగు రైలుతో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. డోర్నకల్- గద్వాల్‌, కల్వకుర్తి – మాచర్ల, కాచిగూడ‌  కాచిగూడ –జగ్గయ్యపేట (250 కి.మీ.), పటాన్‌చెరు – ఆదిలాబాద్ (320 కి.మీ.), బోధన్ – లాతూర్ (175 కి.మీ.), అక్కన్నపేట బైపాస్ లైన్ (8 కి.మీ.) మార్గాల‌ను వెంట‌నే మంజూరు చేయాల‌ని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణ‌వ్‌కు ముఖ్య‌మంత్రి విజ్ఞ‌ప్తి చేశారు.

దక్షిణ మధ్య రైల్వే ప్రతిష్టాత్మకంగా చేపట్టదలచిన మెగా కోచింగ్, ఫ్రైట్ మెయింటెనెన్స్ డిపోను మహబూబాబాద్ స‌మీప అనంతారం గ్రామంలో ఏర్పాటు చేయాల‌ని కేంద్ర మంత్రి కోరారు. ఈ డిపో ఏర్పాటుకు అవ‌స‌ర‌మైన‌ 409 ఎకరాల 1 గుంట భూమిని రైల్వే శాఖ‌కు అప్పగించేందుకు ఇప్ప‌టికే అంగీక‌రించిన విష‌యాన్ని ముఖ్య‌మంత్రి కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. మెగా ఫ్రైట్ మెయింటెనెన్స్ డిపోకు త్వరగా అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని సీఎం కోరారు.
 

ఇదీ చదవండి: సింగరేణి కార్మికులకు శుభవార్త

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)