Breaking News

అల్లు అర్జున్ అరెస్ట్‌పై సీఎం రేవంత్‌ కీలక వ్యాఖ్యలు

Published on Fri, 12/13/2024 - 20:03

సాక్షి, ఢిల్లీ: అల్లు అర్జున్ అరెస్ట్‌పై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో ఓ జాతీయ మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ‘‘ఓ మహిళ చనిపోయింది. ఆమె కొడుకు ప్రాణాలతో పోరాడుతున్నాడు. ప్రాణం పోయినా కేసు పెట్టొద్దా?. ఘటనపై క్రిమినల్‌ కేసు నమోదైంది. కోమాలో నుంచి ఆ బాబు బయటకు వస్తే వాళ్ల అమ్మ కనిపించదు. సినిమా హీరోది వ్యాపారం. డబ్బులు పెట్టాడు.. వసూలు చేసుకున్నాడు. ఇందులో ఇచ్చిపుచ్చుకునేందుకు ఏముంది?. నేను తీసుకునేది ఏముంది?’’ అంటూ ప్రశ్నించారు.

‘‘కారులో వచ్చి సినిమా చూసి వెళ్తే ఎటువంటి సమస్య ఉండకపోయేది. కానీ కారులోంచి బయటికి వచ్చి చేతులుపి హడావుడి చేశారు. దాంతో జనం పెద్ద ఎత్తున ఎగబడ్డారు.. కంట్రోల్ కాలేదు. అందుకే అల్లు అర్జున్‌ను ఈ కేసులో ఏ11గా పోలీసులు చేర్చారు.

..అక్కడ మహిళ ప్రాణం పోయింది? ఎవరు బాధ్యులు. నాకు చిన్నప్పటినుంచి అల్లు అర్జున్ తెలుసు, అతనికి నేను తెలుసు. అల్లు అర్జున్ మామ చిరంజీవి కాంగ్రెస్ నేత. అల్లు అర్జున్‌కు పిల్లనిచ్చిన మామ చంద్రశేఖర్‌రెడ్డి కాంగ్రెస్ నేత.. నాకు బంధువు. అల్లు అర్జున్ భార్య మాకు బంధువు.

..హోం శాఖ నా వద్ద ఉంది. ఈ కేసుకు సంబంధించిన రిపోర్ట్ నాకు తెలుసు. చనిపోయిన మహిళ కుమారుడు ఇంకా కోమాలో ఉన్నాడు. సినిమా కోసం డబ్బులు పెట్టారు.. పైసలు సంపాదించారు. వాళ్లు ప్రత్యేకంగా దేశం కోసం చేసింది ఏం లేదు.’’ అంటూ రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. 

ఇదీ చదవండి: Allu Arjun Case: ఆ సెక్షన్లు అంత తీవ్రమైనవా?

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)