Breaking News

నేడు సూర్యాపేటకు సీఎం కేసీఆర్‌

Published on Sun, 08/20/2023 - 02:11

సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదివారం జిల్లా కేంద్రం సూర్యా పేటలో పర్యటించనున్నారు. జిల్లా కేంద్రంలో నిర్మించిన కలెక్టరేట్‌ కార్యాలయ సముదాయం, ఎస్పీ కార్యాలయం, మెడికల్‌ కళాశాల, వెజ్, నాన్‌ వెజ్‌ మార్కెట్, బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయ భవనాలను ఆయన ప్రారంభిస్తారు. అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను జిల్లాకు తీసుకొచ్చినందున ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం ప్రసంగించనున్నా రు.

ఎన్నికలకు ముందు నిర్వహిస్తున్న మొదటి సభ కావడంతో విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి నేతృత్వంలో 100 ఎకరాల్లో పెద్ద ఎత్తున సభకు ఏర్పాట్లు చేశారు. ఉదయం 11:15 గంటలకు సీఎం కేసీఆర్‌ సూర్యాపేట పట్టణ కేంద్రానికి చేరుకొని, సాయంత్రం 4:50 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి తిరిగి హైదరాబాద్‌కు వెళ్లనున్నారు.

 జాతీయ రహదారిపై నేడు వాహనాల మళ్లింపు 
సూర్యాపేట జిల్లా కేంద్రంలో సీఎం కేసీఆర్‌ బహిరంగసభ నేపథ్యంలో వాహనాలను దారి మళ్లిస్తు న్నట్లు పోలీసులు తెలిపారు. హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళ్లే వాహనాలను నార్కట్‌పల్లి వద్ద నల్లగొండ వైపు మళ్లిస్తారు. ఖమ్మం వెళ్లే వాహనాలను టేకుమట్ల నుంచి ఖమ్మం రహదారి మీదుగా మళ్లించనున్నారు. విజయవాడ నుంచి హైదరాబా ద్‌ వెళ్లే వాహనాలను కోదాడ, హుజూర్‌నగర్, మి ర్యాలగూడ మీదుగా నార్కట్‌పల్లి వైపు మళ్లిస్తారు.

Videos

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు