Breaking News

కోటిన్నరకు చేరువలో కంటి వెలుగు పరీక్షలు

Published on Mon, 05/15/2023 - 03:55

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం కోటిన్నర కంటి పరీక్షలకు చేరువైంది. ఈ ఏడాది జనవరి 18న ప్రారంభమైన రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం కింద 1,42,30,576 మందికి కంటి వైద్య పరీక్షలు చేశారు. వీరిలో 20.69లక్షల మందికి రీడింగ్‌ అద్దాలు పంపిణీ చేశారు.

ఇప్పటివరకు 10,285 గ్రామ పంచాయతీ వార్డులు, 3,221 మున్సిపల్‌ వార్డుల్లో ఈ కార్యక్రమం నిర్వహించినట్టు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రభుత్వ సెలవు దినాలు, పండుగలు మినహాయించి ప్రభుత్వ పనిది­నాలకు అనుగుణంగా కొనసాగిస్తూ వచ్చిన ఈ రెండో విడత కార్యక్రమం  జూన్‌ 15వ తేదీ నాటికి వందరోజులు పూర్తి చేసుకోనున్నట్లు రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ తెలిపింది. 

దగ్గరి చూపు సమస్యలున్న వారే ఎక్కువ 
కంటివెలుగు కార్యక్రమంలో అత్యధికంగా దగ్గరి చూపు సమస్యలున్న వారే గుర్తించబడుతున్నారు. వారికి తక్షణమే రీడింగ్‌ అద్దాలను పంపిణీ చేస్తున్నట్లు వైద్య శాఖ వర్గాలు చెబుతున్నాయి. దగ్గరి చూపు సమస్యలున్న వారిలో అత్యధికులు 40 ఏళ్ల వయసు పైబడిన వారున్నారు. ఇవి కాకుండా కంటి సమస్యలతో వస్తున్న చాలా మందికి చుక్కల మందులతో పాటు విటమిన్‌ ఏ, డీ, బీ కాంప్లెక్స్‌ టాబ్లెట్లు పంపిణీ చేస్తున్నారు.

కాగా, 50 ఏళ్లు పైబడిన వారు అత్యధికంగా మోతబిందు(కాటరాక్ట్‌) సమస్యతో బాధపడుతున్నారు. శస్త్ర చికిత్స అవసరమైన వారికి చికిత్స చేసే సమయాన్ని సెల్‌ఫోన్‌ ద్వారా సమాచారం చేరవేస్తున్నామని వైద్య శాఖ అధికారులు చెబుతున్నారు. ఇదివరకే శస్త్ర చికిత్స పూర్తయి ఇతర సమస్యలతో బాధపడుతున్న వారికి ఎప్పటికప్పుడు వైద్యులు సలహాలు, సూచనలు అందజేస్తున్నారు.  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)