Breaking News

నెలాఖరులో తేలికపాటి వర్షాలు

Published on Sun, 01/11/2026 - 02:04

సాక్షి, హైదరాబాద్‌: వాతావరణంలో మార్పులు వేగంగా నమోదవుతున్నాయి. చలి కాలం చివరి దశకు చేరుతుండడంతో ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో పగటి పూట ఉష్ణోగ్రతలు సాధారణ స్థితిలో నమోదవుతుండగా...రాత్రి పూట ఉష్ణోగ్రతలు మాత్రం సాధారణం కంటే తక్కువగా నమోదవుతున్నాయి. బంగాళాఖాతంలో మారుతున్న వాతావరణ పరిస్థితులు, వాయుగుండాల ప్రభావం, రాష్ట్రానికి తూర్పు, ఈశాన్య దిశల నుంచి వీస్తున్న గాలులతో చలి తీవ్రత పెరుగుతోంది.

చివరి వారంలో ఉత్తర, మధ్య తెలంగాణ, తూర్పు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు నమోదవుతాయని, ఆ సమయంలో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణ స్థితిలో నమోదు కావొచ్చని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్‌ తక్కువగా నమోదవుతున్నాయి. రానున్న మూడు రోజులు ఇదే తరహాలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. శనివారం గరిష్ట ఉష్ణోగ్రత ఖమ్మంలో 30.2 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత ఆదిలాబాద్‌లో 8.2 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది.  

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)