Breaking News

నోటరీ వ్యవస్థ ‘ప్రక్షాళన’

Published on Sun, 11/23/2025 - 03:49

సాక్షి, హైదరాబాద్‌: నోటరీ వ్యవస్థను ప్రక్షాళన చేయాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ నిర్ణయించింది. ప్రస్తుతం నోటరీలుగా ఉన్న వారిలో కొందరిని తొలగించడంతోపాటు త్వరలోనే అర్హులైన మరికొందరిని నోటరీలుగా నియమించనుంది. ప్రజల దైనందిన జీవితాల్లో కీలక డాక్యుమెంట్లకు చట్టబద్ధత కల్పించే ఈ నోటరీ వ్యవస్థపై ఫిర్యాదులు పెరుగుతుండడంతో పారదర్శకతకు చర్యలు చేపట్టాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. దీంతో నోటరీ వ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టిన స్టాంపుల శాఖ వడివడిగా ఆ ప్రక్రియను ముందుకు తీసుకెళుతోంది.  

కోవిడ్‌ సమయం నుంచే.. 
రాష్ట్రంలో ప్రస్తుతం 2,150 మందికి పైగా నోటరీలు ఉన్నారు. వీరంతా కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, చిరునామా మార్పు, తప్పొప్పులను సరిచేయడం లాంటి వాటి కోసం అ«దీకృత ప్రమాణ పత్రాలు (అఫిడవిట్‌) ఇస్తుంటారు. కొన్ని సర్టిఫికెట్ల కోసం డిక్లరేషన్‌లు కూడా నోటరైజ్‌ చేస్తారు. వీటితోపాటు ఆస్తుల హక్కుల మారి్పడి పత్రాలను కూడా కొందరు నోటరైజ్‌ చేస్తున్నారు. 

ఈ నోటరైజ్డ్‌ డాక్యుమెంట్ల ఆధారంగా స్థానిక సంస్థల నుంచి ఇంటి నంబర్లు తెచ్చుకొని చాలామంది నేరుగా రిజి్రస్టేషన్‌ చేసుకుంటున్నారు. దీంతో హక్కుల మార్పిడి ద్వారా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండి పడుతోంది. డిక్లరేషన్‌లు ఇచ్చే సందర్భంలో అక్రమాలకు పాల్పడుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. కొందరయితే ఏకంగా తమ లైసెన్స్‌ కాలపరిమితి ముగిసిన తర్వాత మళ్లీ ప్రభుత్వం వద్ద రెన్యువల్‌ చేయించుకోకుండానే డాక్యుమెంట్లను నోటరైజ్‌ చేస్తున్నారు. 

తద్వారా వారు చేసే డాక్యుమెంట్లకు ఎలాంటి చట్టబద్ధత ఉండకపోయినా ప్రజలు మోసపోతున్నారు. కరోనా సమయం నుంచి చాలామంది నోటరీలు క్రియాశీలంగా లేరని, ప్రస్తుతమున్న వారిలో 800 మంది వరకు సరిగా డాక్యుమెంట్లు చేయడం లేదని, మరికొందరైతే అసలు రెన్యువల్‌ కూడా చేసుకోవడం లేదని తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో నోటరీ వ్యవస్థను చక్కదిద్దే చర్యలకు ప్రభుత్వం పూనుకుంది. అందులో భాగంగానే రాష్ట్రంలోని నోటరీలందరి వివరాలను ఆన్‌లైన్‌లో నిక్షిప్తం చేస్తోంది. 

ఏ జిల్లాలోని ఏ మండలం, ఏ గ్రామం, ఏ ప్రాంత పరిధిలో నోటరీగా ఎవరు పనిచేస్తున్నారు? వారి ఫోన్‌ నంబర్లతో సహా వివరాలను స్టాంపుల శాఖ వెబ్‌సైట్‌లో పొందుపరిచే ప్రక్రియ జరుగుతోంది. దీనికి తోడు క్రియాశీలంగా లేని వారు, లైసెన్స్‌ రెన్యువల్‌ చేసుకోని వారిని గుర్తించి తొలగించాలని నిర్ణయించింది. ఈ మేరకు కొత్తగా నోటరీలుగా ఎంతమంది అవసరమవుతారనే అంచనాలను పంపాలని జిల్లా రిజి్రస్టార్ల ద్వారా సమాచారాన్ని తీసుకుంటోంది. వీలైనంత త్వరలో కొత్త నోటరీల నియామకానికి నోటిఫికేషన్‌ జారీ చేయనుంది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)