Breaking News

ఇంజనీరింగ్‌ ఫీజులపై స్పష్టత

Published on Sat, 11/15/2025 - 05:58

సాక్షి, హైదరాబాద్‌: ఎట్టకేలకు ఇంజనీరింగ్‌ ఫీజులపై స్పష్టత వచ్చింది. కాలేజీల వారీగా ఫీజులు నిర్ణయిస్తూ రాష్ట్ర ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (ఎఫ్‌ఆర్‌సీ) ప్రభుత్వానికి ఫైల్‌ పంపింది. ప్రభుత్వం దీన్ని పరిశీలించి, ఆమోదించాల్సి ఉంది. ఆ తర్వాత అధికారికంగా జీవో వెలువడే వీలుంది. వచ్చే వారం ఈ ప్రక్రియ మొత్తం పూర్తవుతుందని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. 2025–26 నుంచి మూడేళ్లకు ఈ ఫీజులు వర్తించాల్సి ఉంటుంది. అయితే, ఇప్పటికే ఇంజనీరింగ్‌ ప్రవేశాలు పూర్తయ్యాయి. ప్రవేశాల సమయంలో పాత ఫీజులే వసూలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.

దీంతో పెరిగిన ఫీజులు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయనేది ప్రభుత్వమే స్పష్టత ఇవ్వాల్సి ఉంది. లేనిపక్షంలో విద్యార్థులు గందరగోళానికి గురవుతారని అధికారులు అంటున్నారు. ఎఫ్‌ఆర్‌సీ ప్రతీ మూడేళ్లకోసారి ఫీజులను సమీక్షిస్తుంది. యాజమాన్యాలు ఇచ్చే ఆడిట్‌ నివేదికల ఆధారంగా ఫీజులను నిర్ణయిస్తుంది. వాస్తవానికి 2025 ఆరంభం నుంచే ఈ ప్రక్రియ మొదలైంది. ఫీజుల పెంపుపై ఎఫ్‌ఆర్‌సీ గతంలోనే నివేదిక ఇచ్చినా.. ప్రభుత్వం ఆమోదించలేదు. ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ వి.బాలకిష్టారెడ్డి నేతృత్వంలో కమిటీని వేసింది. ఈ కమిటీ సిఫార్సుల మేరకు ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఆ తర్వాత మరోసారి యాజమాన్యాలతో ఎఫ్‌ఆర్‌సీ చర్చలు జరిపి, ఫీజులను  నిర్ణయించింది. 

పెంపు.. కుదింపు 
జాతీయ ర్యాంకులు, మౌలిక వసతులు, ప్లేస్‌మెంట్స్, ఫ్యాకల్టీ వంటి అంశాలను ఫీజుల పెంపునకు ప్రామాణికంగా తీసుకున్నట్టు తెలుస్తోంది. జాతీయ గుర్తింపు ఉన్న సంస్థలను ఒక కేటగిరీగా, లేనివాటిని మరో కేటగిరీగా, సాధారణ వసతులు, ఫ్యాకల్టీ ఆశించిన మేర లేని కాలేజీలను మూడో కేటగిరీ కిందకు తెచ్చినట్టు తెలిసింది. మొదటి కేటగిరీకి ఆడిట్‌ రిపోర్టుల ప్రకారం ఫీజులు పెంచే వీలుంది. రెండో కేటగిరీలో అత్యధికంగా ఉన్న కాలేజీల ఫీజులు కొంత తగ్గించినట్టు తెలుస్తోంది. మూడో కేటగిరీలో గ్రామీణ, జిల్లా కేంద్రాల్లో ఉన్న కాలేజీల పట్ల కొంత ఊరట ఇవ్వాలని భావిస్తున్నారు. అయితే, ఫీజులు సాధారణ స్థాయిలో పెంచాలని నిర్ణయించినట్టు సమాచారం. 

Videos

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)