Breaking News

ఇంజనీరింగ్‌ ఫీజులపై త్వరలో స్పష్టత

Published on Tue, 10/14/2025 - 06:15

సాక్షి, హైదరాబాద్‌: ఇంజనీరింగ్‌ ఫీజులపై త్వరలో స్పష్టత రానుంది. ప్రభుత్వం ఫీజుల నిర్ధారణతో జీవో విడుదల చేసే అవకాశం ఉందని అధికార వర్గాల సమాచారం. కొన్ని కాలేజీలకు ఫీజులు పెంచి, మరికొన్ని కాలేజీలకు ఫీజులు తగ్గించాలని భావిస్తున్నారు. రాష్ట్ర ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ ఇప్పటికే ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపింది. ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ వి.బాలకిష్టారెడ్డి నేతృత్వంలో కమిటీ చేసిన సిఫార్సులను కొలమానంగా తీసుకున్నట్టు తెలుస్తోంది. కొన్నేళ్లుగా ఇంజనీరింగ్‌ ఫీజుల వ్యవహారంలో పీఠముడి పడిన విషయం తెలిసిందే. తొలుత ఎఫ్‌ఆర్‌సీ చేసిన ఫీజుల ప్రతిపాదనను ప్రభుత్వం నిలిపివేసింది. కాలేజీల్లో మౌలిక వసతులు, ఫ్యాకల్టీ, జాతీయ ర్యాంకుల ఆధారంగా ఫీజులు ఉండాలని భావించింది.

ఈ దిశగా కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. దీని తర్వాత ఎఫ్‌ఆర్‌సీ మరో దఫా కాలేజీలతో సంప్రదింపులు జరిపింది. ఆడిట్‌ రిపోర్టులను పరిశీలించింది. వీటి ఆధారంగా మూడు కేటగిరీలుగా కాలేజీలను విడగొట్టినట్టు తెలిసింది. ర్యాంకులు, వసతులు, ఫ్యాకల్టీ పరంగా ఉన్న కాలేజీలను మొదటి కేటగిరీలోకి చేర్చారు. వీటికి గతంలో నిర్ధారించిన ఫీజులే అమలుచేసే వీలుంది. ర్యాంకులు లేకున్నా, ఫ్యాకల్టీ, వసతులు ఉన్న కాలేజీలను మరో కేటగిరీలోకి చేర్చారు.

వీటి ఫీజుల పెంపును 15 శాతం మించకుండా చూడాలని భావిస్తున్నారు. మార్గదర్శకాలకు అనుగుణంగా లేని కాలేజీలకు ఫీజులు తగ్గించే యోచనలో ఉన్నారు. ఇప్పటికే ఇంజనీరింగ్‌ క్లాసులు మొదలయ్యాయి. ఈ కారణంగా పెరిగే ఫీజును వచ్చే విద్యా సంవత్సరం నుంచే అమలు చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. అయితే, దీనిపై ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉంది.

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)