Breaking News

ఠాణా మెట్లెక్కించిన సిగరేట్‌

Published on Tue, 08/12/2025 - 11:35

గోదావరిఖని: సిగరేట్‌ తాగాలనే తాపత్రయం ఠా ణా మెట్లెక్కించింది. ఇరువర్గాలు రోడ్డుపై కొట్టుకో వడం భయాందోళనకు గురిచేసింది. పోలీసులు రంగప్రవేశం చేసి 8మందిపై కేసు నమోదు చేశారు. గోదావరిఖనిలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. వన్‌టౌన్‌ సీఐ ఇంద్రసేనారెడ్డి కథనం ప్రకారం.. ఇద్దరు మిత్రులు సిగరెట్‌ కోసం రాజేశ్‌ థియేటర్‌ సమీపంలోని ఓ పాన్‌షాప్‌ వద్దకు వెళ్లారు. మూడు సిగరెట్లకు డబ్బులు చెల్లించగా రెండు సిగరెట్లే ఇచ్చావని షాపు నిర్వాహకుడిని ప్రశ్నించారు. 

ఈక్రమంలో ఇరువర్గాల మద్య మాటామాట పెరిగింది. కొట్టు కట్టేసే సమయం అయిపోయిందని, పక్కకు వెళ్లి సిగరెట్‌ తాగాలని షాపు యాజమాని సూచించాడు. దీంతో ఆయనపై ఇద్దరు మిత్రలు చేయి చేసుకున్నారు. ఈక్రమంలో బాధితుడు తన బందువులకు ఫోన్‌చేసి ముగ్గురిని పిలిపించాడు. సిగరెట్‌ కోసం వచ్చిన ఇద్దరు యువకులు కూడా ఫోన్‌చేసి మరో ఇద్దరిని పిలిపించుకున్నారు.  దీంతో ఇరువర్గాలకు చెందిన 8 మంది నడిరోడ్డుపై కొట్టుకోవడంతో అక్కడ భీతావహ పరిస్థితి తలెత్తింది. 

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలను అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ఒకవర్గానికి చెందిన కె.ప్రణయ్‌కౌశిక్, మహ్మద్‌ ఆజీం, బి.ఆదర్శ్, టి.రాహుల్, మరో వర్గానికి చెందిన ఎం.శ్యాంసుందర్, ఎం.అభిలాష్, జి.రాజ్‌కుమార్, సీహెచ్‌ చంద్రమౌళిగా గుర్తించారు. నడిరోడ్డుపై గొడవకు దిగి శాంతిభద్రతలకు భంగం కలిగించిన నిందితులపై కేసునమోదు చేసినట్లు సీఐ తెలిపారు. సిగరేట్‌ కోసం ఠాణా మెట్లు ఎక్కి కేసులో ఇరుక్కోవడం నగరంలో చర్చనీయాంశమైంది.  

Videos

AP: ఇద్దరి IPS ల సస్పెన్షన్ ఎత్తివేత

కొండా సురేఖపై వేటు..

గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమంలో కేతిరెడ్డి

రాజీనామానా..? బర్తరఫ్ నా..? క్లైమాక్స్ కు కొండా సురేఖ ఎపిసోడ్

లక్ష్మణ్ తో BCCI కీలక మీటింగ్ టెన్షన్ లో గంభీర్, అగార్కర్

LIC కొత్త పాలసీ.. బెనిఫిట్స్ తెలిస్తే ఎగిరి గంతేస్తారు

KA పాల్ బంపర్ ఆఫర్

Kurnool: SV మోహన్ రెడ్డి తనయుడి రిసెప్షన్ కు హాజరైన YS జగన్

ఎవరివైపు పబ్లిక్? చాణక్య సర్వేలో క్లారిటీ!

ధనుష్ పార్టీకిలోకి TVK మంత్రి..?

Photos

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)