Breaking News

విచారణకు అమరావతి రావాలని మార్గదర్శి ఎండీ శైలజకు సీఐడీ ఆదేశం

Published on Thu, 04/06/2023 - 11:08

సాక్షి, హైదరాబాద్‌: మార్గదర్శి కేసులో ఏపీ సీఐడీ విచారణ ముగిసింది. మార్గదర్శి ఎండీ శైలజకు సీఐడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 13న విచారణకు అమరావతి సీఐడీ కార్యాలయానికి  హాజరుకావాలని ఆదేశించింది. అవసరమైతే రామోజీని విచారిస్తామని, ఆయన కూడా సీఐడీ కార్యాలయానికి రావాల్సి ఉంటుందని తెలిపారు.

మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ అక్రమ వ్యవహారాల కేసులో ఏ–2గా ఉన్న ఆ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ చెరుకూరి శైలజ కిరణ్‌ను సీఐడీ అధికారులు గురువారం విచారించారు. జూబ్లీహిల్స్‌లోని శైలజ కిరణ్‌ ఇంటికి చేరుకున్న సీఐడి బృందం శైలజ కిరణ్‌ ‍స్టేట్‌మెంట్‌ను వీడియో రికార్డింగ్‌ చేశారు. 

ఇదిలా ఉండగా, మార్గదర్శి చిట్‌ఫండ్స్‌.. కేంద్ర చిట్‌ఫండ్‌ చట్టం–­1982కు విరుద్ధంగా చందాదారుల సొమ్మును మ్యూచువల్‌ఫండ్స్, షేర్‌ మార్కెట్లో పెట్టు­బడిగా పెట్టడం, రిజర్వ్‌ బ్యాంకు నిబంధన­లకు విరుద్ధంగా అక్రమ డిపాజిట్ల సేకరణపై సీఐడీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో ఏ–3గా ఉన్న కొందరు మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ బ్రాంచి మేనే­జర్లను సీఐడీ విభాగం అరెస్ట్‌ చేసింది. కాగా ఈ కేసులో ప్రధాన నిందితుడు, ఏ–1గా ఉన్న చెరుకూరి రామోజీరావును సీఐడీ అధికారులు సోమవారం విచారించారు. నిధుల మళ్లింపు వాస్తవమేనని ఆయన అంగీకరించడం ప్రాధా­న్యం సంతరించుకుంది.

పైగా అది తమ సంస్థ ఇష్టమని.. అసలు విచారించడానికి సీఐడీకి ఏం అధికారం ఉందన్న రీతిలో రామోజీరావు ప్రవ­ర్తించడం అందర్నీ విస్మయపరచింది. కానీ సీఐడీ అధికారులు నిబంధనల మేరకు ఆయనను విచారించి కీలక విషయాలు రాబ­ట్టారు. ఏ–1గా ఉన్న రామోజీరావే నిధుల మళ్లింపు నిజమేనని దాదాపుగా అంగీకరించ­డంతో ఈ కేసులో సీఐడీ కీలక పురోగతి సాధించినట్లయింది.
 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)