Breaking News

పాత నేరస్తుల పని పడుతున్నారు!

Published on Sat, 03/09/2024 - 05:49

సాక్షి, హైదరాబాద్‌: ఏళ్లుగా తప్పించుకు తిరుగుతున్న పాత నేరస్తులను, నిందితులను తెలంగాణ సీఐడీ పోలీసులు చాకచక్యంగా అరెస్టు చేసి తీసుకువస్తున్నారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలకు పారిపోయిన మోసగాళ్లను సైతం కటకటాల వెనక్కి నెడుతున్నారు. గత 40 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న నాన్‌బెయిలబుల్‌ వారెంట్ల (ఎన్‌బీడబ్ల్యూ) అమలు కోసం తెలంగాణ సీఐడీ విభాగంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎన్‌బీడబ్ల్యూ స్పెషల్‌ ఎగ్జిక్యూషన్‌ టీం సత్ఫలితాలిస్తోంది. 2023 ఫిబ్రవరిలో ఈ ప్రత్యేక సెల్‌ ఏర్పాటు చేసినప్పటి నుంచి మొత్తం 212 నాన్‌బెయిలబుల్‌ వారెంట్లను పరిష్కరించారు. రూ.కోట్లలో అమాయకులను మోసగించి దశాబ్దాలుగా పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్న అంతర్రాష్ట్ర నేరస్తులపై ఎస్పీ రామ్‌రెడ్డి నేతృత్వంలోని ఈ ఎన్‌బీడబ్ల్యూ స్పెషల్‌ ఎగ్జిక్యూషన్‌ బృందం ఫోకస్‌ పెట్టింది. ఫలితంగా పాత కేసులలోనూ చిక్కుముడులు వీడుతున్నాయి. మొత్తంగా ఏడాదికాలవ్యవధిలో 156 ఎన్‌బీడబ్ల్యూల సమాచారం ప్రత్యేక బృందం సేకరించింది. 56 మంది పాత నేరస్తులను అరెస్టు చేసింది. 

ఇటీవల అమలు చేసిన ఎన్‌బీడబ్ల్యూ కేసులు కొన్ని.. 
► మంచిర్యాల టౌన్‌లో 1995 నమోదైన ఒక డెకాయిటీ కేసులో 29 ఏళ్లుగా తప్పించుకు తిరుగుతున్న అప్పల సత్తయ్య అనే నేరస్తుడిని ఈ ఏడాది జనవరి 24న కరీంనగర్‌లో అరెస్టు చేసింది. 
► ఆన్‌లైన్‌ ఓఎల్‌ఎక్స్‌ మోసం కేసులో ఎనిమిదేళ్లుగా సీఐడీ సైబర్‌క్రైం పోలీసులకు చిక్కకుండా ఉన్న సోహాల పొద్దార్‌ అనే పాత నిందితుడిని ముంబైలో ఈ ఏడాది జనవరి 29 ఎన్‌బీడబ్ల్యూ స్పెషల్‌ ఎగ్జిక్యూషన్‌ టీం అరెస్టు చేసింది.  
► కృషి బ్యాంకు కుంభకోణం కేసులో 22 ఏళ్లుగా పరారీలో ఉన్న ఆ బ్యాంకు డైరెక్టర్‌ కాగితాల శ్రీధర్‌ను గతేడాది సెప్టెంబర్‌ 25న పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో అరెస్టు చేసింది.

సాంకేతికత వినియోగంతో సమాచారం కూపీ లాగుతారు..
మోసాలు చేయడంలో దిట్ట అయిన సదరు పాత నేరస్తులను గుర్తించేందుకు తెలంగాణ సీఐడీ ఎన్‌బీడబ్ల్యూ స్పెష ల్‌ ఎగ్జిక్యూషన్‌ టీం సాంకేతికతను వినియోగిస్తోంది. నేర స్తుల సీడీఆర్‌ (కాల్‌ డీటెయిల్డ్‌ రికార్డ్‌), బ్యాంకు ఖాతాల కు లింక్‌ అయిన ఉన్న మొబైల్‌ నంబర్ల ఆధారంగా, అదేవిధంగా స్విగ్గీ, ఓయో, ర్యాపిడో, అమెజాన్‌ డాటా ఆధారంగా వివరాలు సేకరిస్తున్నారు. సైకాప్స్‌ అప్లికేషన్‌ ద్వారా కూడా వివరాలు విశ్లేíÙస్తున్నారు. గ్యాస్‌ కనెక్షన్, మొబైల్‌ నంబర్‌కు ఇచ్చే ఆధారాలు, సోషల్‌ మీడియా ఖాతాల్లో ఫో న్‌ నంబర్లు ఇలా...అన్ని కోణాల్లో సదరు నిందితుల సమాచారం సేకరిస్తున్నారు. ఎక్కడున్నాడనేది స్పష్టత వచి్చన తర్వాత క్షేత్రస్థాయిలో ఆపరేషన్‌ చేపడుతున్నారు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)