Breaking News

గూగుల్‌పై చిల్కూరు పూజారి రంగరాజన్‌ ఆగ్రహం

Published on Fri, 06/07/2024 - 18:58

హైదరాబాద్‌, సాక్షి: చిల్కూరు బాలాజీ ఆలయ పూజారి రంగరాజన్ ఇంటర్నెట్‌ సెర్చింజన్‌ గూగుల్‌పై మండిపడుతున్నారు. ఆలయానికి సంబంధించి గూగుల్‌లో చూపిస్తున్న తప్పుడు సమాచారంపై ఆయన అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ.. మీడియాతో స్పందించారు.

గూగుల్‌లో చిల్కూరు టెంపుల్‌ అని టైప్‌ చేస్తే.. కింద శనివారం, ఆదివారం రోజుల్లో గుడి క్లోజ్ అంటూ గూగుల్ సమాచారం చూపిస్తోంది. తిరిగి సోమవారం ఉదయం 8గం.కు తెరుచుకుంటుందని ఉంది. అయితే.. గూగుల్‌ చూపించే ఆ సమాచరం తప్పుడుదని రంగరాజన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అన్ని వేళలా ఆలయం యధావిధిగా తెరిచే ఉంటుంది. గూగుల్‌ మాత్రమే కాదు.. అలాంటి తప్పుడు ప్రచారం ఎక్కడ జరిగినా మేం ఖండిస్తాం అని అన్నారాయన.

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం చిల్కూరు బాలాజీ టెంపుల్‌ ఉంది. వీసా బాలాజీ టెంపుల్‌గా దీనికంటూ ఓ గుర్తింపు ఉంది. విదేశాలకు వెళ్లదల్చుకున్న వాళ్లు ఇక్కడ ప్రత్యేక పూజలు చేస్తారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు ఈ ఆలయానికి వస్తుంటారు. శనివారం, సెలవు రోజుల్లో, పండుగల ప్రత్యేక సందర్భాల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. వారం రోజుల్లో ఉదయం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఆలయం తెరిచి ఉంటుంది. ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు భక్తులు 108 ప్రదక్షిణలు చేస్తూ కనిపిస్తుంటారు. 

Videos

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)