Breaking News

పిల్లలు పుట్టి చనిపోతుండటం మనస్తాపానికి లోనైన దేవి

Published on Tue, 02/11/2025 - 08:53

కుత్బుల్లాపూర్‌ : పిల్లలు పుట్టి చనిపోతుండటం, భర్త మద్యానికి బానిస కావడంతో మనస్తాపానికి లోనైన ఓ మహిళ  ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన పేట్‌ బషీరాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది.. ఎస్సై పరమేశ్వర్‌ రెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాకు చెందిన దేవి (28) కోదండరామ్‌ దంపతులు సుభాష్‌నగర్‌ ప్రాంతంలో నివాసం ఉంటూ కూలీ పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు పుట్టి పది నెలల వ్యవధిలోనే మృత్యువాత పడ్డారు.

అప్పటి నుంచి డిప్రెషన్‌తో బాధపడుతున్న దేవి తరచూ భర్తతో  గొడవ పడేది. ఆదివారం రాత్రి మద్యం మత్తులో ఇంటికి వచ్చిన భర్తతో మరోసారి గొడవ పెట్టుకోవడంతో అతను ఇంట్లో నుంచి బయటికి వెళ్లిపోయాడు. దీంతో మనస్తాపానికి లోనైన దేవి  ఇంట్లో ఐరన్‌ రాడ్డుకు చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. 

తెల్లవారుజామున ఇంటికి వచ్చిన కోదండరామ్‌ దీనిని గుర్తించి పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మృతురాలి సోదరుడు ఇచి్చన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

#

Tags : 1

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)