Breaking News

పాముకాటుకు చిన్నారి బలి

Published on Mon, 10/27/2025 - 11:14

చందుర్తి(వేములవాడ):  ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారి పాముకాటుతో మృత్యువాత పడింది. రాజన్నసిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం ఆశిరెడ్డిపల్లిలో ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన చేకుట లత, రమేశ్‌ దంపతుల ఏడాదిన్నర వయసు ఉన్న కూతురు వేదాన్షి శనివారం సాయంత్రం ఇంటి ముందు ఆడుకుంటుండగా హఠాత్తుగా ఇంట్లో వారికి ఏడుపు వినిపించింది. కుటుంబ సభ్యులు వెంటనే వెళ్లి పరిశీలించగా చిన్నారి కాళ్ల వేలి మధ్యలో నుంచి రక్తం కారుతుండటంతో వెంటనే వేములవాడలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. 

వైద్యులు పరీక్షలు నిర్వహించి, పాము కాటు తో పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. అక్కడి నుంచి అర్ధరాత్రి ఎల్లారెడ్డిపేటలో ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే పాప ప్రాణాలు కోల్పోయింది. చిన్నారి తండ్రి రమేశ్‌ ఆరు నెలల క్రితం దుబాయ్‌ వెళ్లాడు. పాముకాటుకు కూతురు మృతిచెంది న విషయం తెలుసుకున్న తండ్రి రమేశ్‌ స్వగ్రా మానికి బయలుదేరినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం పాప మృతదేహాన్ని బాడీఫ్రీజర్‌లో భద్రపరిచారు. చిన్నారి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రమేశ్‌ తెలిపారు.  

#

Tags : 1

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)