Breaking News

తగ్గిన చికెన్‌ ధర.. పెరిగిన గుడ్డు ధర

Published on Sat, 12/07/2024 - 13:39

జ్యోతినగర్‌(రామగుండం): బహిరంగ మార్కెట్‌లో కోడిగుడ్ల ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. ఇదే సమయంలో చికెన్‌ ధరలు తగ్గుతూ వస్తున్నాయి. ఒకకోడిగుడ్డు రిటెయిల్‌ ధర రూ.7గా పలుకుతోంది. హోల్‌సేల్‌గా రూ.6.50గా ధర ఉంది. చలికాలంలో కోడిగుడ్ల ధరలు పెరగడం సాధారణమేనని, కానీ, ఈస్థాయిలో ధర పెరగడం అరుదని కొందరు వ్యాపారులు వివరిస్తున్నారు.

క్రిస్మస్‌, న్యూ ఇయర్‌ కేక్‌ల కోసం..
ఈనెలలో క్రిస్మస్‌ వేడుకలు జరుగుతాయి. ఈ వేడుకల్లో ప్రధానంగా కేక్‌లు కట్‌చేసి మిఠాయిలు పంచుకుంటారు. ఇప్పటికే జిల్లాలో ముందస్తు క్రిస్మస్‌ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఇదేసమయంలో కేక్‌ల వినియోగం, విక్రయాలూ పెరిగాయి. కేక్‌ల తయారీలో కోడిగుడ్ల వినియోగం అధికంగా ఉంటుంది. దీంతో సహజంగానే వాటికి డిమాండ్‌ పెరుగుతోంది. మరోవైపు.. న్యూ ఇయర్‌ వేడుకల కోసం కొందరు ఇప్పటినుంచే ప్లాన్‌ చేసుకుంటున్నారు. వివిధ డిజైన్లలో కేక్‌లు తయారు చేసుకునేందుకు ఆర్డర్లు ఇస్తున్నారు. దీంతో బేకరీలు, మిఠాయి దుకాణదారులు కోడిగుడ్లు కొనుగోలు చేయడం అధికమైంది. ఫలితంగా మార్కెట్‌లో కోడిగుడ్లకు ధర పెరుగుతోందని వ్యాపారులు అంటున్నారు.

కార్తీకం నేపథ్యంలో దిగివచ్చిన చికెన్‌
కార్తీక మాసం నేపథ్యంలో చికెన్‌ ధరలు తగ్గాయి. కార్తీక మాసానికి ముందు కేజీ చికెన్‌ ధర రూ.230వరకు పలికింది. ప్రజలు మాంసాహారానికి దూరంగా ఉండడంతో డిమాండ్‌ పడిపోయిందని, ఫలితంగా చికెన్‌ ధరలు దిగొచ్చాయని వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుతం కేజీ చికెన్‌ ధర రూ.180గా పలుకుతోది. మరోవైపు.. క్రిస్మస్‌, న్యూఇయర్‌, సంక్రాంతి వరకు చికెన్‌ ధరలు మళ్లీ పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు అంటున్నారు.

చలికాలమే కారణం..
30 గుడ్లు గల ట్రే ధర రూ.195గా ఉంది. హోల్‌సేల్‌గా గుడ్డు ధర రూ.6.50గా ఉంది. చలికాలంలో గుడ్ల ధరలు పెరుగుతుంటాయి. క్రిస్మస్‌, న్యూ ఇయర్‌ సందర్భంగా వీటి వినియోగం అధికమైంది.

– గుండ చంద్రమౌళి, హోల్‌సేల్‌ వ్యాపారి, ఎన్టీపీసీ

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)