Breaking News

భారీగా పెరిగిన చికెన్‌ ధరలు

Published on Mon, 07/06/2026 - 07:39

ఇటీవల కాలంలో చికెన్‌ ధరలు విపరీతంగా పెరగడంతో పేద, మధ్యతరగతి ప్రజలకు చికెన్‌ అందుబాటులో లేకుండా పోయింది. వారం రోజులుగా ధరలు పైపైకి ఎగబాకుతూ, ప్రస్తుతం కిలో స్కిన్‌లెస్‌ చికెన్‌ ధర రూ.360కు చేరింది. పది రోజుల క్రితం దీని ధర రూ.240 మాత్రమే ఉండటం గమనార్హం. అలాగే, స్కిన్‌తో కూడిన చికెన్‌ ప్రస్తుతం కిలో రూ.300 వరకు విక్రయిస్తుండగా, బ్రాయిలర్‌ లైవ్‌ కోడి (బర్డ్‌) ధర కిలో రూ.200 నుంచి రూ.220 వరకు పలుకుతోంది. 

ధరల పెరుగుదలకు కారణాలు  
ఇటీవల కూరగాయల ధరలు విపరీతంగా పెరగడంతో, చాలామంది వినియోగదారులు చికెన్‌ కొనుగోలు వైపు మొగ్గు చూపారు. దీనివల్ల ఒక్కసారిగా డిమాండ్‌ పెరిగి ధరలు ఆకాశాన్నంటాయి. అలాగే ప్రస్తుతం రైతుల వద్ద అవసరానికి సరిపడా కోళ్ల లభ్యత లేకపోవడాన్ని ఆసరాగా చేసుకుని కార్పొరేట్‌ సంస్థలు ధరలను తమ ఇష్టానుసారంగా పెంచుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. 

గతంలో కూడా ఇదే పరిస్థితి  
సాధారణంగా ఏటా వేసవిలో చికెన్‌ ధరలు మండిపోతుంటాయి. ఈ ఏడాది కూడా మార్చి నుంచి మే చివరి వరకు కిలో చికెన్‌ రూ.300 నుంచి రూ.350 వరకు, ఓ దశలో రికార్డు స్థాయిలో రూ.380 వరకు కూడా విక్రయించారు. వేసవి తర్వా త ధరలు తగ్గి సాధారణంగా కిలో రూ.200 లోపే ఉన్నప్పటికీ, మళ్లీ పది రోజులుగా ధరలు భారీగా పెరిగాయి. ఆదివారం వచ్చిందంటే చికెన్‌ సెంటర్ల వద్ద సందడి కనిపించేది. కానీ ఈ వారం ధరలు చుక్కలు తాకడంతో మాంసాహార ప్రియులు తమ కొనుగోళ్లను సగానికి సగం తగ్గించుకున్నారు.  

 

Videos

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)