Breaking News

3 నెలల్లో చెన్నూర్‌ దసలి పట్టు వస్త్రాలు

Published on Wed, 05/14/2025 - 04:10

చెన్నూర్‌: దసలి పట్టుకాయ దిగుబడిలో మొదటి స్థానాన్ని సొంతం చేసుకుంటున్న మంచిర్యాల జిల్లా చెన్నూర్‌ పట్టు పరిశ్రమ మరో అడుగు ముందుకేసింది. రైతులకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో పట్టు దారం, వస్త్ర తయారీకి సన్నద్ధం అవుతోంది. వస్త్ర తయారీకి అవసరమైన యంత్రాల కోసం ప్రభుత్వం రూ.20.54 లక్షలు మంజూరు చేసింది. 

దారం, వస్త్రాల తయారీపై శిక్షణకు 30 మంది రైతులను ఎంపిక చేశారు. నెల రోజులపాటు నిపుణులతో చెన్నూర్‌ పట్టు పరిశ్రమలో శిక్షణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరో మూడు నెలల్లో చెన్నూర్‌ కేంద్రంగా పట్టు వస్త్రాల ఉత్పత్తి ప్రారంభిస్తామని అధికారులు చెబుతున్నారు.

రెండు నెలల శ్రమతో రూ.1.5 లక్షల సంపాదన
అటవీ ఉత్పత్తులపై ఆధారపడి జీవించే గిరిజన, ఎస్సీ, బీసీ నిరుపేద రైతులకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం దసలి పట్టు కాయ సాగును ప్రోత్సహిస్తోంది. కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, ఆదిలాబాద్‌ జిల్లాల్లో భూమి లేని రైతులను గుర్తించి దసలి కాయ పండించే విధానంపై శిక్షణ ఇచ్చింది. గత మూడు దశాబ్దాలుగా ఇక్కడ సుమారు వెయ్యి మంది రైతులు 7,500 ఎకరాల్లో దసలి పట్టు కాయలు పండిస్తున్నారు.

కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా గొల్లతరివిడి, కౌటాల, బెజ్జూర్, మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం మన్నెగూడెం, కోటపల్లి మండలం కొత్తపల్లి, రాజారాం, లింగన్నపేట, నాగంపేట, ఎదుల్లబంధం, వేమనపల్లి మండలం ముల్కల్లపేట, చెన్నూర్‌ మండలం కిష్టంపేట, లింగంపల్లి గ్రామాల్లో దసలికాయను పండిస్తూ ఉపాధి పొందుతున్నారు. రెండు నెలల శ్రమతో ఒక్కో రైతు రూ.80 వేల నుంచి రూ.1.50 లక్షల వరకు సంపాదిస్తున్నారు.

మూడు నెలల్లో వస్త్ర తయారీ ప్రారంభం గత ఏడాది దసలి పట్టు రైతుల కిసాన్‌ మేళాలో నూతన భవన నిర్మాణానికి ప్రభుత్వం రూ.40 లక్షలు మంజూరు చేసింది. నిర్మాణం పూర్తి కాగా ఇటీవల మంచిర్యాల జిల్లా కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ ప్రారంభించారు. భవనంలో దారం తీసే యంత్రాలను అమర్చి రీలింగ్‌ చేసి వస్త్రం ఉత్పత్తి చేస్తాం. త్వరలో రైతులకు శిక్షణ తరగతులు ప్రారంభించి మూడు నెలల్లో వస్త్రం తయారు చేస్తాం. –పార్వతి రాథోడ్, ఏడీ, సెరికల్చర్‌

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)